ఈరోజు కి ఇవే ముఖ్యమైన వార్తలు ….

నేను చనిపోతున్నాను బై డాడి అంటూ పెట్టిన సెల్ఫీలే పలువురిని కంట తడి పెట్టించింది .
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస కాలనీ కి చెందిన శోభారాణి అనే యువతీ తలనొప్పి భరించలేక తీవ్ర మనస్థాపం తో దూలానికి ఉరేసుకుంది .
హీరోయిన్ తాప్సి కరంట్ బిల్ 36000 వచ్చిందని వాపోయింది , వారానికి ఒకసారి వచ్చే ఈ ప్లాట్లో ఇక ఉండటం కష్టం అంటోంది .
హైదరాబాద్ చేస్ట్ హాస్పత్రిలో రవికుమార్ కేవలం ఆక్సిజన్ అంధక చనిపోలేదని , అతనికి వెంటిలేటర్ తొలగించలేదని కరోనా తో పాటు వేరే ఇతర సమస్యలు ఉండటం వల్లే తాను చనిపోయాడని సూపెరిండేంట్ మహబూబ్ ఖాన్ తెలిపాడు , కాగా వెంటిలేటర్ పెట్టలేదని సెల్ఫీ వీడియో తీసుకోవటం తెలిసిందే .
మహారాష్ట్రాలో కరోనా విజృంభణ తెలిసిందే 48 గంటల్లో కొత్తగా 150 మంది పోలీసులకి కరోనా రాగ అందులో ఒకరు మరణించారు, దీంతో మొత్తం 4,666 మంది పోలీసులకి కరోనా సోకింది అందులో 57 మంది మరణించారు.
కరోనా కి సంబంధించి మరో మూడు విషయాలు చేర్చింది అమెరికా కు చెందిన హెల్త్ ప్రొటెక్ట్ ఏజెన్సీ,వికారం లేదా వాంతులు , డయేరియా , ముక్కు కారటం కుడా కరోనా లక్షణాలుగా తెలిపింది .
LAC వెంట చైనా యుద్ధ విమానాలు , హెలికాఫ్టర్ లు మోహరించటం తో భారత్ అప్రమత్తం అయి క్షిపణులని రంగంలోకి దించింది .
లాక్ డౌన్ నేపద్యం లో వరుస సినిమాలు తీస్తున్న RGV తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు, ఈ సినిమాకి పవర్ స్టార్ అనే టైటిల్ ప్రకటించాడు , ఇందులో పీకే , MS , NB , TS , ఓ రష్యన్ మహిళా, నలుగురు పిల్లలు మరియు ఓ బర్రే మరియు RGV నటిస్తారు , ఈ సినిమా పాత్రలని అర్ధం చేసుకున్నవాళ్ళకి బహుమతులు మాత్రం ఇవ్వనని RGV తెలిపారు .
హైదరాబాద్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మల్లి లక్డౌన్ దిశగా తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్టు దీనికి మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ వెల్లడించాడు .