today horoscope

Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 16, 2021

Today Horoscope In Telugu 16 February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope In Telugu 16,February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

నిరుద్యోగులకు  ఉపాధి దొరికే అవకాశం ఈ రోజు మెండుగా ఉంది. వీరు  ఏ పని మొదలుపెట్టిన  ఈ రోజు అది పూర్తవుతుంది. పిల్లలు పోటీ పరీక్షలకు రెడీగా ఉంటారు.  భాగస్వామి ఈ రోజు షాపింగ్ చేయడం వల్ల కలిసి వస్తుంది.  ప్రేమ వ్యవహారంలో కొంత నిరాశ పాడుతారు.  విందు వినోదాల్లో పాల్గొంటారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు ఇతరులతో మానుకోవాలి. 

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశి వారికీ సహాయ  సహకారాలు అందుతాయి. అందువల్ల  మీరు విజయం సాధిస్తారు ఈ రోజు కలిసివస్తుంది.   వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి.  అదేవిదంగా  ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.  కార్యకలాపాలను చక్కగా నిర్వహించడంలో విజయవంతమవుతారు. జీవితంలో ఆనందంగా సమయాన్ని ఆస్వాదిస్తారు.  స్నేహితులు సహాయం ముందుకువస్తారు. కానీ వారిని  పూర్తిగా విశ్వసించడం విషయంలో జాగ్రత్తలుతీసుకోవాలి.

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

 ఈ  రాశి వారు ఉద్యోగం మారడానికి ఆలోచనలు మొదలవుతాయి. ఇందుకు ఇది సమయం కాదు. కొత్త  పని ప్రారంభించే ముందు ఆలోచింది నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. విదేశాలకు సంబంధించిన పనిలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.  కుటుంబ తలెత్తిన వివాదాలు ఈ రోజు ఓ కొలిక్కి వస్తాయి.  పిల్లలతో మంచి సమయం గడపడం వల్ల ప్రశాంతతను పొందుతారు.  జీవితంలో గౌరవం పెరుగుతుంది. చదువులో విద్యార్థుల కు అనుకూలమైన రోజు .

కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వీరు ఈ రోజు నూతన ప్రాజెక్టు లు మొదలు పెడుతారు. దానికోసమని అధికారుల అండ ఉంటుంది. పేరు ప్రతిష్ట లు పొందుతారు.  సోదరులకు సహాయం చేస్తారు.  జీవితం ఆనందంగా ఉంటుంది. బయటకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం. వివాహం కోసం చూసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. 

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

 భాగస్వామి మీ ఎదుగుదలకు  మంచి సపోర్ట్ ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి అవుతాయి.  ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అధిక షాపింగ్ మిమ్మల్ని కష్టాల్లోకి నెత్తుతుంది.  వ్యాపారులకు నగదు అవసరం అవుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడుతాయి.

కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

బిజినెస్  మెరుగ్గా సాగుతుంది.  ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతారు.  జీవితంలో నూతన ఉత్సాహం కలుగుతుంది.  కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ప్రేమ గురించి కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఫలితంగా కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారె అవకాశం ఉంది.  ఆందోళన నెలకొంటుంది. పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికంగా లాభం చేకూరుతుంది.

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వీరు చేసే పనిలో  అధికారుల  మద్దతు లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. అవసరమైన పనులు పూర్తి చేస్తారు.  తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారు.  పరీక్షల కోసం విద్యార్థులు మరింత కష్టపడాలి.  ఆస్తి వివాదం  అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కొన్ని శుభవార్తలు పిల్లల నుంచి వింటారు. తీరిక లేకుండా గడపడం వల్ల ప్రేమ ను పొందలేరు.  అయితే మీ భాగస్వామి మాత్రం మీతో  సమయం గడపాలని ఆశిస్తారు. అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ సభ్యుడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది.  ఈ కారణంగా కుటుంబంలో ఒడిదొడుకులు ఏర్పడుతాయి.  వ్యాపార రంగంలో ఉండే శత్రువులు వాల్ల ఇబ్బందులు తప్పవు.  విద్యార్థులు ఇంకా కష్టపడాల్సి సమయం వచ్చింది.  జీవితంలో కొంత మనశ్శాంతి మాత్రమే ఉంటుంది.  వీలైనంత వరకు వివాదాల కు దూరంగా ఉంటె మంచిది. (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ప్రేమ వ్యవహారాన్ని కుదుట పడుతాయి. శారీరక అనారోగ్య నుండి విముక్తి లభిస్తుంది.  మన్సులో సంతోషంగా అనిపిస్తుంది.  జీవనోపాధి రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి.  విద్యార్థులు కొన్ని అడ్డంకులను చవిచూడాల్సి వస్తుంది.  కుటుంబం నుంచి పూర్తి మద్దతు  ఉంటుంది.

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

 ఈ రాశి వారికీ  సానుకూలం వాతావరణం ఉండటం వల్ల  నూతన ప్రాజెక్టులపై మీరు దృష్టి పెడతారు. సమాజంలో  గౌరవం పెరుగుతాయి.    పార్టీ ల  వల్ల  సమస్యలు ఎదురవుతాయి.  శత్రువులు మీ వెన్నంటి ఉంటారు. వీరితో జాగ్రత్తగా ఉండాలి.  ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త పాటించాలి.

 మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

ఈ రాశి వారు పరిస్థితుల కారణంగా నిరాశ చెందుతారు. దాంపత్య జీవితంలో మానసిక ఒత్తిడి ఉంటుంది.  భాగస్వామి నమ్మకాన్ని గెలవడం అవసరం.  వృద్ధుల సహకారాన్ని వాతావరణాన్ని కొంతవరకు పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఉపాధికి సంబంధించి శుభవార్త వింటారు.  వ్యాపారంలో కుటుంబ సభ్యుల  మద్దతు ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. 

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button