today horoscope

Today Horoscope: 25 ఫిబ్రవరి2021 రాశి ఫలాలు

Today Horoscope 25 February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope 25 February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ  రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.  ఆహారం నియమాలు పాటించాలి లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  బయట ఆహారం తినకపోవడం మంచిది. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ఏదైనా చేసే అవకాశముంది. ఈ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు మద్దతునివ్వండి.  అదృష్టం 75 శాతం గా ఉంది.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వీరికి ఈ రోజు  శుభకరంగా ఉంటుంది. అదేవిదంగా  వైవాహిక జీవితంలో తృప్తి ఉంటుంది. జీవిత భాగస్వామితో సుఖసంతోషాలు పంచుకుంటారు.  కుటుంబంతో రోజంతా సరదాగా గడుపుతారు. మరోవైపు వ్యాపారులకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. లాభ మార్గంలో అడ్డంకులు వచ్చే అవకాశముంది. అదృష్టం 81 శాతం గా ఉంది.

మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. తగాదాలు , వాదనలకు దిగకండి. ఈ రోజు మీకు కొన్ని శుభకార్యాలు చేసే అవకాశం లభిస్తుంది. ఇతరుల సహాయం అందుకుంటారు. నిలిచిపోయిన పనులు ప్రారంభిస్తారు.  ఆర్థిక పరంగా మీకు బాగుంది.  అదృష్టం 89 శాతం గా ఉంది.

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వీరికి ఈ రోజు సాధారణ స్థితులు ఉంటాయి. ఎవరితోనూ వాదనలకు దిగకపోవడమే మంచింది. ఏవైనా సమస్యలు ఉంటె సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సంబంధాలు కలుపుకుంటారు. అదృష్టం 67 శాతం గా ఉంది.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వీరు ఈ చాల బిజిగా గడుపుతారు. ఫలితంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. ఫలితాలు మీకు అనుకూలంగా మారుతాయి.  భాగస్వామితో ఆనందాన్ని పంచుకుంటారు.  మీ మధ్య పరస్ఫర అవగాహన పెరుగుతుంది. మీ సంబంధం కూడా మెరుగుపడుతుంది. మీరు ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోకండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవాళ్లు ఉంటారు.  అదృష్టం 79 శాతం గా ఉంది.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

లాభాలు రావడానికి ఆస్కారం ఉంది.  మీ స్నేహితులు, బంధువులు డబ్బు  ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు.   అందరూ మీతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు చదువుపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.  ప్రయాణాల్లో కాస్త అలసిపోయిన విజయం చేకూరుతుంది. ముఖ్యవార్త వింటారు.  మీకు అదృష్టం 80 శాతం గా ఉంది.

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వీరికి అంత శుభం జరుగుతుంది.  ఏ విషయంలోనైనా చురుకుదనం చూపిస్తారు.  మీకు అన్ని రకాల ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కొందరు వ్యక్తుల ద్వారా మీరు వ్యాపారంలో లాభం పొందవచ్చు.  మీ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  అదృష్టం 76 శాతం గా ఉంది.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

మీకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు కావచ్చు. ఫలితంగా  విజయాన్ని పొందుతారు. మీ మంచి ప్రవర్తన నూతన స్నేహితులను చేస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో పని ప్రారంభమవుతుంది. ఈ రోజు జీవిత భాగస్వామి, కుటుంబంతో కలిసి కడుపుతారు.  యాత్రలకు వెళ్లే ఆలోచనలు చేస్తారు. ఆఫీస్ లో మీకు అనుకూల వాతావరణం లభిస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు.  అదృష్టం 91 శాతం గా ఉంది.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వీరికి రాజకీయాలలో విజయాన్ని అందుకుంటారు. ప్రతి ఒక్కరు మీకు మద్దతు నిలుస్తారు.  ఈ సందర్భంలో మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యలో విద్యార్థులు మనస్ఫూర్తిగా తీసుకుంటారు. జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి.  అదృష్టం 79 శాతం గా ఉంది.

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఈ రాశివారికి  కాస్త మనశ్శాంతి కరువవుతుంది. కొన్ని  విషయాలు త్వరలోనే పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీరు పెరుగుతున్న ఖర్చులను తనిఖీ చేయాలి. ఈ రోజు మీరు మరింత కష్టపడి మీ ప్రవర్తనను మార్చుకోవాలి.  అప్పుడు మీ పరిస్థితులు బాగుంటాయి.  అదృష్టం 70 శాతం గా ఉంది.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

మీరు కష్టపడితేగాని ఫలితాలు లభించవు.  విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది.  కార్యాలంయలో స్నేహితులు మద్దతుగా ఉండి పనిలో సహకరిస్తారు. తల్లిదండ్రుల , భార్య నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇల్లు నిర్మించడంలో ఈ రోజు తీరిక  ఉండదు.  అదృష్టం 70 శాతం గా  ఉంది.

మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

వీరికి  వ్యాపారంలో పెట్టుబడి కలిసివస్తుంది. కొత్త  పరిచయాలు ఏర్పడతాయి. ప్రత్యేక వ్యక్తులను కలవడం ఆనందంగా ఉంటుంది. ప్రయాణంలో  ఆనందం లభిస్తుంది.  శుభకార్యాలకు వెళ్లారు. జీవితంలో ప్రయోజనం పొందుతారు. స్నేహితులు మద్దతు ఉంటుంది.  అదృష్టం 80 శాతం గా ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button