today horoscope

Today Horoscope: 23 ఫిబ్రవరి2021 రాశి ఫలాలు

Today Horoscope 23 February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

23rd February Horoscope

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారు రుణాలు పొందే అవకాశం ఉంది. ఏదైనా సంస్థ, లేదా బ్యాంకు ద్వారా ఈ మొత్తాన్ని పొందుతారు. అప్పు తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ తీసుకున్నా తీర్చడం కోసం చాల ఇబ్బంది పాడుతారు. గౌరవం పొందుతారు.  స్నేహితులు మద్దతు ఉంటుంది.  జీవిత భాగస్వామికూడా  మద్దతు లభిస్తుంది.  అదృష్టం 88 శాతం ఉంది.

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రయాణాల విషయంలో  జాగ్రత్తగా ఉండండి. మంచి  నిర్ణయం తీసుకునే విషయంలో  ప్రయోజనం పొందే అవకాశముంది. ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటారు. మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తుంటే ఈ సమయం అనుకూలం. భవిష్యత్తులో ను మీ నిర్ణయం మేలు చేస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు.  మీకు అదృష్టం 71 శాతం గా ఉంది.

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

 ఈ రోజు ఈ రాశి వారికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తపడాలి. లేదంటే ఆర్థికసమస్యలు ఎదురవుతాయి.  అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ రోజు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే సాయంత్రం సమయంలో ఉల్లాసంగా గడుపుతారు.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో ఆలోచించాలి.  ఆకస్మిక ప్రయోజనం పొందవచ్చు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువవుతుంది.  పిల్లల నుండి శుభవార్త వింటారు.  అదృష్టం 77 శాతం ఉంది.

 కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

 ఈ రాశివారికి అనుకూలమైన రోజు.  ఫలితాలు చాల బాగుంటాయి.  పిల్లలపై విశ్వాసం బలంగా ఉంటుంది. ఈ రోజు తల్లి వైపు నుంచి ప్రేమ, ప్రత్యేక మద్దతు లభించే అవకాశముంది. కీర్తి లభిస్తుంది.  తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి.   వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటె మంచిది.  అదృష్టం 54 శాతం గా ఉంది.

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రాశివారికి  ఫలితాలు అనుకూలంగా ఉన్నాయ్.  తల్లిదండ్రుల మద్దతు, ఆశీర్వాదం వల్ల మంచి చేకూరుతుంది.  ఈ రోజు అత్తగారి వైపు నుంచి ఆగ్రహ సంకేతాలు కనిపిస్తాయి. మాటలను మాట్లాడే టపుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాదులనుండి బయటపడతారు.  అదృష్టం 58 శాతం గా ఉంది.

 కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రాశి వారు  కష్టమైన పనులను ధైర్యంగా చేయగలుగుతారు.  తల్లిదండ్రుల మద్దతువల్ల  ఆనందాన్ని పొందుతారు. శరీర నొప్పి కారణంగా జీవిత భాగస్వామి నుంచి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. పనికిరాని విషయాల గురించి  మీరు బాగా ఆలోచిస్తారు. వ్యాపారంలో లాభం అందుకుంటారు.  అదృష్టం 52 శాతం గా ఉంది.

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

 వీరికి ఈ రోజు  శుభకరంగా ఉంటుంది.  ఆస్తి లు  పెరుగుతాయి. మనస్ఫూర్తిగా సేవ చేస్తారు. నూతన కార్యాల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అది శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో మనశ్శాంతి, ఆనందం మీ వెంటే ఉంటుంది. గురువులు, పెద్దవారి నుంచి మద్దతు లభిస్తుంది. అనవసర విషయాల్లో తల దూర్చడం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి.  అదృష్టం 73 శాతం గా ఉంది.

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

 ఈ రోజు వీరికి మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు.   ఇది మాత్రమే కాదు వ్యాపార వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు నేడు ఫలించవు. సాయంత్రం నాటికి మీరు సహనంతో, ప్రతిభతో శత్రు పక్షాన్ని జయిస్తారు .  ఏదైనా చర్చ పెండింగులో ఉంటే అందులో విజయం సాధించడానికి చాలా రోజులు వేచి చూడాల్సివస్తోంది.  మీకు అదృష్టం 50 శాతం గా ఉంది.

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఈ రాశి వారికీ  జ్ఞానం పెంపొందుతుంది. ఆధ్యాత్మిక ఆచారాలపై ఆసక్తితో ఉంటారు . మీరు పూర్తిగా ఆరోగ్యం  సహకరిస్తుంది.  మీకు అదృష్టం నుంచి పూర్తి మద్దతుతో లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒళ్లునొప్పులు వచ్చే  అవకాశముంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో సంయమనం గా ఉండాలి.  మీకు అదృష్టం 52 శాతం గా ఉంది.

 మకరం (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఈ రోజు కొత్త వస్తువులను పొందవచ్చు. దీంతో పాటు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. . అవసరం లేని విషయాలలో ఒత్తిడి  ఉంటుంది. అత్తమామల వైపు నుంచి అనుకూలత, గౌరవం లభిస్తాయి.  పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కచ్చితంగా పెట్టండి. భవిష్యత్తులు ప్రయోజనాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టం 67 శాతం గా ఉంది.

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వీరు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తారు.  మీరు పరిమితమైన, అవసరమైన వాటిని మాత్రమే ఖర్చు చేస్తారు.  ఆనందం మీవెంటే ఉంటుంది. రాత్రి వరకు ప్రయోజనం ఉంటుంది. స్నేహితుడిని కలవడం వల్ల మనస్సుకు హాయిగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలు పెట్టుకోకండి.  మీకు అదృష్టం 70 శాతం గా ఉంది.

మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

 వీరికి  అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. సంతానానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటె అది ఈరోజు  పరిష్కరించుకుంటారు. సంతోషకరమైన వ్యక్తిత్వం కావడంతో ఇతర వ్యక్తులు మీతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు.  గౌరవం పొందడంవల్ల మీ సామాజిక ధైర్యం పెరుగుతుంది.  కుటుంబం నుంచి సంతోషం ఉంటుంది.  అదృష్టం 84 శాతం గా ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button