today horoscope

Today Horoscope: 22 ఫిబ్రవరి2021 రాశి ఫలాలు

Today Horoscope 22 February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope 22 February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రాశివారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. సమాజంలో శుభకరమైన వ్యవహారాలకు సహాయం చేయడం వల్ల  కీర్తి లభిస్తుంది.  వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కష్టపడటం వల్ల ఫలితం సాధిస్తారు.  అదృష్టం 92 శాతం గా ఉంది.

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొత్త అంశాలపై  దృష్టి ని కేద్రీకరిస్తారు. ఫలితంగా మనస్సు ప్రశాంతంగా మారుతుంది.  చట్టపరమైన వివాదంలో విజయం లభిస్తుంది.  కుటుంబంలో సంతోషం వెల్లివిస్తుస్తుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.  సహచరులు నుంచి మీకు మద్దతు ఉంటుంది.  అదృష్టం 88 శాతం గా ఉంది.

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

 మీరు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అందువల్ల మీ పని పూర్తి చేయడానికి సులభమవుతుంది.  విశ్రాంతి తీసుకోవడానికి తగిన సమయాన్ని తీసుకోవాలి.  ప్రణాళికలు వేసుకొని మరి ముందుకు వెళ్తారు. మీ  అధికారుల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు.  చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం వరిస్తుంది.  అదృష్టం 79 శాతం గా ఉంది.

 కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

 ఈ  రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. ప్రతి  పని  అంకితభావంతో చేస్తారు. ఫలితంగా విజయాలు పొందుతారు.  అసంపూర్తిగా ఉన్న పనులు జరుగుతారు.  మీ ఆలోచనల వల్ల ప్రశాంత  వాతావరణం సృష్టించుకుంటారు. సహచరులు మీకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తారు.  అదృష్టం 75 శాతం గా ఉంది.

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వీరికి  విజయాలు చేకూరే అవకాశం మెండుగా ఉంది.   రాజకీయ రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు.   పిల్లలపట్ల అన్ని బాధ్యతలు నెరవేరుస్తారు.   ఈ రోజు మీరు మీ తోటి వారితో పోటీ పడి విజయం అందుకుంటారు.  ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య  విషయంలో జాగ్రత్తగా ఉండండి.  అదృష్టం 78 శాతం గా ఉంది.

 కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఈ రోజు మీరు చాల ఓపికగా ఉండాలి.  ఏదైనా శుభకార్యం గురించి చర్చ జరుగవచ్చు.  అదృష్టం మిమల్ని వరిస్తుంది.  ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఈ రోజు పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండాలి.  అదృష్టం 56 శాతం గా ఉంది.

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

 ఈ రోజు మీకు ప్రయోజనకరంగా సాగుతుంది.  ప్రవర్తన విషయంలో చాల జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు  నేడు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టు లు కూడా ఈ రోజు మొదలుపెడతారు.  రియల్ ఎస్టేటు విషయంలో కుటుంబం, చుట్టుపక్కల ప్రజలు కొంత ఇబ్బందికి గురిచేస్తారు.  ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచింది.  అదృష్టం 55 శాతం గా ఉంది.

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

 ఈ రాశివారికి  ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు మీరు లాభాల బాట పాడుతారు.  అందువల్ల క్రియాత్మకంగా ఉండండి. మనశ్శాంతిని కలిగి ఉండండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు తీసుకురాగలిగితే భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుంది. పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీకు అదృష్టం 85 శాతం గా ఉంది.

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

 వీరు  ఈ రోజు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.  వ్యాపారం విషయంలో కొంచెం రిస్క్ చేయడం  పెద్ద లాభం వస్తుందనే ఆశ ఉంది. రోజువారీ పనులకు మించి కొన్ని కొత్త పనులు చేసే అవకాశముంది. ఈ రోజు ధనలాభం ఉంది.  నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది.  మీకు అదృష్టం 61 శాతం గా ఉంది.

 మకరం (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఈ రోజు వీరికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో లాభాల బాట పాడుతారు.  రోజువారీ ఇంటి పనులను నిర్వహించడానికి నేడు మంచి అవకాశం లభిస్తుంది. కొడుకు, కుమార్తే గురించి పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నిజాయితీగా మెదిలితే మర్యాదలు లభిస్తాయి.  పనుల వల్ల కొంత  ఆందోళన పెరుగుతుంది.  అదృష్టం 63 శాతం గా ఉంది.

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వీరు  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా మెదలాలి.  ఆహారం, పానీయాల్లో అజాగ్రత్తగా వ్యవహరించకండి.  వ్యాపారపరంగా ఈ రోజు ఆహ్లాదకరమైన సమయం అవుతుంది. తొందరపాటులో పొరపాట్లు చేసే అవకాశముంది. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చేయండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరం మంచింది. అదృష్టం 52 శాతం గా ఉంది.

మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

 ఈ రోజు మీకు  ప్రయోజనకరంగా ఉండనుంది. వ్యాపారంలో  లాభాలు అందుకుంటారు.  సహనం, మృదువైన ప్రవర్తన ద్వారా సమస్యలను దూరం కొడతారు.  మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అనుకున్నవి  మీరు పొందుతారు. పేద వారికీ సహాయం చేయగలిగితే శుభం కలుగుతుంది.  అదృష్టం 69 శాతం గా ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button