today horoscope

Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 19, 2021

Today Horoscope In Telugu 19 February 2021:  జ్యోతిషశాస్త్రాన్ని భారతీయు ప్రజలు ఎంతగానో  విశ్వసిస్తారు. ఈ  జ్యోతిషసాస్త్రం తో  గ్రహాల కదలికలు, జాతకంపై వాటి యొక్క  ప్రభావం ఎలా ఉంటుందో  తెలుసుకోవచ్చు. రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి. మానవుల  పుట్టుక ఆధారంగా వారు ఏ రాశిలో జన్మించారో లెక్కిస్తాను.  తమ  భవిష్యత్తు లో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతివారిలోను  ఉంటుంది. వాటిని ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు మనకు ఎంతో తోడ్పడుతాయి.

Today Horoscope In Telugu 19 February 2021

మేష రాశి (Aries ) (అశ్విని, భరణి, కృత్తిక 1)

సకాలంలో పనులు పూర్తిచేసుకుంటారు.  అంతేకాకుండా ఈ రోజు మీరు ఎవ్వరికీ ఎలాంటి మాట ఇవ్వొద్దు.  మీరు మంచి చేయాలని చూస్తున్న వారు మీకు హాని తలపెట్టాలని యోచిస్తున్నారు. కుటుంబంలో కార్యకలాపారు  వాయిదా పడుతాయి.  ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనవసర విషయాల్లో జోక్యం మంచిదికాదు. అదృష్టం ఈ రోజు  55 శాతం గా ఉంది. 

వృషభ రాశి (Taurus ) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రోజు  వ్యాపారంలో విజయం చేకూరుతుంది.  అంతేకాకుండా కాస్త పని ఒత్తిడి ఉంటుంది. మరోవైపు ఉద్యోగంలో మీకు నూతన పని అప్పగించవచ్చు. ఇంటి సమస్యలు పెరుగుతాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు కలత ను వీడండి.  పెద్దల అభిప్రాయాన్ని తీసుకోండి. మీ సమస్యలకు  కొంత వరకు పరిస్కారం మార్గం దొరుకుతుంది.  అదృష్టం ఈ రోజు 63 శాతం గా ఉంది. 

మిథున రాశి (Gemini ) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

 అదనపు బాధ్యతలు ఈ రోజు మీపై పడుతాయి.  ఫలితంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే మీరు ఓపికగా ఉంటే మంచి అనుభూతి లభిస్తుంది.  సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా మీకిష్టమైన వ్యక్తి కలుస్తారు.  వారికి సాయం చేయాల్సి రావచ్చు. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మిమ్మల్నీ మీరు బలహీనంగా అంచనా వేసుకోకూడదు.   అదృష్టం ఈ రోజు 59 శాతం గా ఉంది. 

 కర్కాటక రాశి (Cancer ) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

 ఈ రోజు మీకు  ప్రత్యేకమైన రోజు.  ఏవైనా  ఆరోపణలకు గురైనప్పుడు ఆచితూచి మాట్లాడాలి.  ఎలాంటి తప్పుడు ఆలోచనలను మనస్సులోకి రానీయ వద్దు. మీరు ఏం చేస్తున్నారో అంతరాయం కలిగించకుండా జాగ్రత్త వహించండి.  మీరు వ్యాపారం లేదా ఒప్పందం కుదుర్చుకునే సందర్భం వచ్చింది.  అదృష్టం ఈ రోజు 57 శాతం గా ఉంది. 

సింహ రాశి (Leo ) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

 మీ చుట్టూ ఉన్న వాతావరణంపై ఒక కన్నేయడం ఉత్తమం.  ఎందుకంటే మీకు ఎవరైనా ఎప్పుడైనా హాని కలిగించే అవకాశముంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు కూడా  జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీకు హాని జరగవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. లేకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అదృష్టం ఈ రోజు 55 శాతం గా ఉంది. 

 కన్య రాశి (Virgo ) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

 మీ ముందు  పెళ్లి ప్రతిపాదన వస్తుంటాయి.  కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. పనిప్రదేశంలో ఈ రోజు మీకు మార్పులు ఉంటాయి. కుటుంబానికి సంబంధించి మీ బాధ్యతలను నెరవేర్చుతారు.  లేకుంటే కుటుంబ సభ్యులతో దూరం పెరుగుతుంది. అదృష్టం ఈ రోజు 56 శాతం గా ఉంది. 

తులా రాశి (Libra )  (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

 మీ ప్రేమికుడి గురించి బాధ పడుతుంటే, నిస్సహాయత, అసమర్థత గురించి వారికి తెలియజేయాలి. ఈ ఇబ్బందులు త్వరలోనే సమసిపోతాయని తెలుసుకోండి.  ముఖ్యమైన పత్రాలను పనిప్రదేశంలో జాగ్రత్తగా ఉంచండి. లేకుంటే ఎవరైనా కావాలని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తారు.  అనవసర విషయాల్లో జోక్యం మంచిది కాదు.  అదృష్టం ఈ రోజు 53 శాతం గా ఉంది. 

వృశ్చిక రాశి (Scorpio ) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

కొత్త  ఉద్యోగం  లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నట్లయితే అనుభవం  ఉన్న వ్యక్తుల సలహా తీసుకోండి. బహుశా మీకు వాటిలో ఒకటి ఉపయోగకరంగా మారుతుంది.  మీ స్థాయిలో మీరు ఏం చేయాలో సకాలంలో చేయండి. అత్తగారి వైపు నుంచి ఏదైనా వివాదం జరిగే అవకాశం ఉంది.  కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చేపట్టిన పనలు, ప్రారంభించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.  అదృష్టం ఈ రోజు 65 శాతం గా ఉంది. 

ధనస్సు రాశి (Sagittarius ) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అన్ని విషయాల్లో  నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. ఎందుకంటే మీరు సమయానికి ఎలాంటి ముందడుగు వేయకపోతే మీ పనులకు ఆటంకం కలుగుతుంది.  పిల్లల విద్య గురించి మనస్సులో ఆందోళన ఉంటుంది. ఏదైనా పోటీలో విజయం గురించి వార్తలు వస్తాయి. తలచిన  పనులు ఈ రోజు సాయంత్రం నాటికి పూర్తి చేసుకుంటారు. రాత్రి పూట కొన్ని  కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఉంది.  అదృష్టం ఈ రోజు 60 శాతం గా ఉంది. 

 మకరం (Capricorn ) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

మీ పనులు చేయడానికి  ఈ రోజు అనుకూలంగా ఉంది.  ఏదైనా విషయాన్ని ఎక్కువ వాయిదా వేయకండి.  లేకుంటే సమస్యలు పెరిగే అవకాశమంది. రాబోయే రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వింటారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల బాధ్యతను సకాలంలో  తీరుస్తారు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ రోజు మీకు ఉపయోగకరంగా  ఉంటుంది. అదృష్టం ఈ రోజు 69 శాతం గా ఉంది. 

కుంభ రాశి (Aquarius ) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

 మీ  జీవితం కొన్ని మంచి మార్పులు వస్తాయి.  మీరు కొత్త ప్రదేశాలకు  మారుతుంటే  దాన్నిఆస్వాదించండి. పదోన్నతులు వచ్చే అవకాశముంది. కుటుంబంలో శుభవార్త సంకేతాలు వినిపిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు  సృష్టించుకుంటారు. మీ మాటల మృదుత్వం, మీకు గౌరవం తీసుకొస్తుంది. విద్య, పోటీలో ప్రత్యేక విజయం అందుకుంటారు.  అదృష్టం ఈ రోజు 75 శాతం గా ఉంది. 

మీన రాశి (Pices ) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

ఈ రోజు మీరు  సమావేశాలలో పాల్గొంటారు.  అనవసర గందరగోళంలో పడొద్దు.  చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. మధ్యాహ్నం తర్వాత కోర్టు కేసులు పరిష్కరించుకుంటారు. ఈ రోజు శుభకరమైన ఖర్చులు మీ కీర్తిని పెంచుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు పోకండి.  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.  అదృష్టం ఈ రోజు 70 శాతం గా ఉంది. 

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button