Today 29th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 29th September updated news in Telugu :
1. ఈ ఏడాది పోయిన సంవత్సరంతో పోలిస్తే హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. 18 శాతం పెరిగినట్లు తెలిపిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన అనారక్
2. తమిళనాడు రాష్ట్రానికి కావేరి నీళ్లను ఇవ్వబోమంటూ కర్ణాటక వాసులు నిరసన… రేపు బందుకు పిలుపు
3. నేడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
4. త్వరలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం ఆడే ఇండియన్ టీంలో కీలక మార్పులు చేసిన బిసిసిఐ.. అక్షర్ పటేల్ ప్లేస్ లో అశ్విన్ రీప్లేస్
5. ఢిల్లీలో కార్పెంటర్లను కలిసిన రాహుల్ గాంధీ.. వారి వృత్తి గురించి నైపుణ్యాల గురించి ఆరా తీసిన కాంగ్రెస్ అగ్రనేత

6. ఇండియా కూటమి ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియదని.. కాంగ్రెస్ పార్టీ లాగా తమ పార్టీ అజెండా లేకుండా పనిచేయడం లేదని సంచలన వాక్యాలు చేసిన ఎమ్మెల్సీ కవిత
7. నేడు ఘనంగా ముగిసిన 63 అడుగుల ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. భారీగా తరలివచ్చిన జనం
8. వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.27 లక్షలకు విక్రయం.. లడ్డు కోసం 38 మంది పోటీ
9. రాష్ట్రంలో కాంగ్రెస్ హావా నడుస్తుందని.. సర్వేల ఆధారంగానే టికెట్లు ఉంటాయని అధిష్టానం వెల్లడించినట్లు తెలిపిన మైనంపల్లి హనుమంతరావు
10. మధ్యప్రదేశ్లో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. దుండగులను ఉరితీయాలని సర్వత వెలువెత్తుతున్న డిమాండ్లు