Today 1st September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 1st September updated news in Telugu : 1. నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
2. ఏసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపు
3. 62 రోజులపాటు సాగిన అమర్నాథ్ యాత్ర నేటితో ముగియనుంది.
4. ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన షర్మిల… వైయస్సార్టిపి ని కాంగ్రెస్లో వీలినంపై చర్చ
5. విఏఓ లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.3900 నుంచి రూ.5వేలకు జీతాలు పెంపు

6. టీచర్ల బదిలీపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
7. చంద్రయాన్-3 కి సంబంధించిన లాండర్ రోవర్ వంటివి అన్ని సరిగా పనిచేస్తున్నాయని తెలిపిన ఇస్రో చిఫ్ సోమనాథ్
8. పండుగ పూట సిరిసిల్లలో తీవ్ర విషాదం.. తమ్ముడి మృతి దేహానికి రాఖీ కట్టిన అక్క.. అది చూసి కంటతడి పెట్టిన స్థానికులు
9. మణిపూర్లో మళ్లీ చిలరెగిన అల్లర్లు.. కాల్పుల్లో నలుగురు మృతి
10. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని ఆహ్వానం