Today 19th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 19th September updated news in Telugu :
1. తుక్కుగూడలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు
2. ఎంఎస్ ధోనీకి కెప్టెన్సీ లేకుంటే వన్డే రికార్డులు బద్దలు కొట్టేవాడని.. కెప్టెన్ గా లేకపోయి ఉంటే నెంబర్ 3 పొజిషన్లో ఆడేవాడని ధోనిపై ప్రశంశాల వర్షం కురిపించిన గౌతమ్ గంభీర్
3. తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభను బిఆర్ఎస్ స్పాన్సర్ చేసిందని, బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని విమర్శించిన తెలంగాణ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి
4. ప్రగతి భవన్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ శోభ దంపతులు
5. హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయకుని మొదటి పూజలో పాల్గొన్న గవర్నర్లు తమిళ్ సై, దత్తాత్రేయ

6. వరంగల్లో అక్టోబర్ 16న బిఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపిన ఎమ్మెల్సీ కవిత
7. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ
8. యూపీఏ ఏపీ తెలంగాణ రాష్ట్రల విభజన సరిగా చేయలేదని మోదీ పార్లమెంట్లో వ్యాఖ్యలు
9. కాంగ్రెస్ గ్యారెంటీలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు… కాంగ్రెస్ గ్యారంటీలను చూసి అయ్యా కొడుకులు అంగీలు చింపుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డి కౌంటర్
10. తెలంగాణపై మోడీ చేసిన వ్యాఖ్యలు బాధించాయని తెలంగాణ ప్రజలకు అయన క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్