Today 18th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 18th September updated news in Telugu :
1. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్రమంత్రి అమిత్ షా
2. నేడు హైదరాబాద్ కేంద్రబిందువుగా ఐదు పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కమ్యూనిస్టు సభలు .. నగరం మొత్తం పోలీసు బలగాలు మోహరింపు
3. నేడు గాంధీభవన్లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు
4. నేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా పీఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించిన మోదీ
5. చంద్రబాబు అరెస్టుకు పెరుగుతున్న మద్దతు… బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా నేడు హైదరాబాద్ లో నిరసన

6. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. 2024లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్
7. తెలంగాణ బిజెపి ముఖ్య నేతలతో భేటీ అయిన అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి ఆరా తీసిన కేంద్రమంత్రి
8. కెసిఆర్డ్ థర్ ఫ్రంట్ కి నాయకత్వం వహించాలి… ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్
9. తుక్కుగూడ బహిరంగ సభలో 6 గ్యారెంటీలను ప్రకటించిన సోనియా గాంధీ
10. సూపర్ -4 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం