Today 15th September updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 15th September updated news in Telugu :
1. తెలంగాణలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ
2. సీబీఎస్ఈ విద్యార్థులు మార్కెట్లో డబ్బులు చెల్లించి 10,12 వ క్లాస్ ప్రాక్టీస్ పేపర్లను కొనవద్దని సీబీఎస్ఈ బోర్డు హెచ్చరిక
3. రేపు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ
4. చట్టం ఎవరికి చుట్టం కాదు.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు అంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు
5. డ్రగ్స్ కేసులో తనకు అసలు సంబంధం లేదని.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసిన హీరో నవదీప్

6. బేబీ మూవీ డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసేలా ఉందని.. ఆ మూవీ నిర్మాతకి నోటీసులు ఇస్తామని తెలిపిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్
7. హిందీ భాష అందరినీ ఏకం చేస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన తమిళ్ నాడు మంత్రి ఉదయనిది స్టాలిన్.. ప్రాంతీయ లాంగ్వేజ్లను అమిత్ షా కించపరచడం కరెక్ట్ కాదని ట్వీట్
8. తెలంగాణ రాష్ట్రంలో తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేసిన బిజెపి స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
9. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడి నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత… ఇది రాజకీయ కక్షేనని.. ఎన్నికల వస్తున్నాయి కాబట్టి మరో డ్రామాకు తెర లేపరంటూ కవిత వివరణ
10. నేడు చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తాయని తెలిపిన జనసేనని