కారులో 21 ఏళ్ల యువతి తో … ముగ్గురు మగాళ్లు…. పోలీసుల కంట పడటంతో బండారం మొత్తం బట్టబయలు..!

ప్రేమ పేరుతో ఒక యువతిని నమ్మించి మోసం చేసాడు ఒక ప్రబుద్దుడు. మోసం చేసిన వ్యక్తి , తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారి శైలిలో కేసును ఛేదించి ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతికి అదే గ్రామానికి చెందిన రామ్ అన్వేష్ అనే యువకుడు మాయమాటలు చెప్పి ఆ యువతిని ప్రేమలో దించాడు. ఇలా కొన్ని రోజులు ఎవరి కంట పడకుండా చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్లి కొన్ని రోజులు సహజీవనం చేసాడు. ఫలితంగా ఆ అమ్మాయి గర్భవతి అయింది.
ఈ సందర్భంలో ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు వారి కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేసారు. ఈ విషయం కాస్త రామ్ కి తెలిసింది. దీనితో రామ్ ఒక ప్లాన్ వేసాడు. అతని ఊరికి చెందిన ఒక ఉపాధ్యాయుడు రాం రాజయ్య ఫోన్లో మాట్లాడాడు. తాను హైదరాబాద్ నుండి యువతిని తీసుకొని వస్తున్నట్టు, తనపై ఎలాంటి కేసు లేకుండా చేసి, గ్రామా పంచాయితిలోనే సమస్యను పరిష్కరించాలని కోరాడు. మొత్తం విషయం విన్న ఆ రాజయ్య సరేనన్నాడు. ఇక రామ్ సంతోషం తో ఆ యువతిని తీసుకొని తన ఊరికి బయలు దేరాడు.
వీరు వచ్చే విషయం పోలీసులకు తెలిసి కరీంనగర్ జిల్లా అల్గునూరు వద్ద తనిఖీలు చేపట్టారు.పోలీసుల తనిఖీలు చేస్తున్న విషయం రామ్ కి తెలిసి , యువతిని తాను చెప్పినట్టు చేయమని , చేస్తే నిన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పాడు. రామ్ ఆ యువతిని పిచ్చిదానిలా నటించామన్నాడు. రామ్ మాటలు ఆ యువతి నమ్మినట్టు చేసి, తీరా పోలీసుల కంట పడగానే ఆ యువతి బోరున విలపించి జరిగిన విషయాన్నీ పూర్తిగా పోలీసులకు తెలిపింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ముగ్గురిని స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసారు.