నా పిల్లలు ఫీల్ అవుతున్నారు: సూపర్ స్టార్ సతీమణి
మనం ఏ పని చేయాలి అనుకున్నా ఎలాంటి విజ్ఞాలు కలగకుండా ఉండడానికి విజ్ఞనాయకుడు వినాయకుడికి తొలి పూజ చేయడం ఆనవాయితీ. “గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా” ఇప్పుడు ఏ వీధి చూసినా ఏ ఇంట్లో చూసినా మన కంటికి దర్శనమిచ్చేది ఆ బొజ్జ గణపయ్య. వినాయకచవితి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆ బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించిఆ తరువాత మూడు రోజులకు, తొమ్మిది రోజులకు, పదకొండు రోజులకు నిమజ్జనం చేసే విషయం అందరికి తెలిసిందే.
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంట్లో కూడా ప్రతి యేటా వినాయక చవితి వేడుకను ఘనంగా జరుపుకుoటారు. తాము సెలెబ్రేట్ చేసుకున్న ప్రతి అకేషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషాన్ని ఫాన్స్ తో పంచుకుంటూ ఉంటారు . ప్రతి ఏడాది లాగా ఈ సారి కూడా వినాయకచవితి సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత, పిల్లలు goutam,sitara ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ్రత ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరి ఇప్పుడు అ గణేశుడికి వీడ్కోలు చెప్పే టైం వచ్చేసింది. మహేశ్‌బాబు ఇంట్లో కొలువైన గణేశున్ని నిమజ్జనం కోసం సిద్ధం చేసారు మన మహేష్ పిల్లలు goutam,sitara. ఇద్దరూ ఆ బాధ్యతను తీసుకుని సవ్యంగా నెరవేరుస్తున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నమ్రత షేర్ చేసారు. ‘‘మై క్యూట్ బేబీస్ goutam,sitara గణేషుడిని నిమజ్జనానికి పంపుతున్నారు. వారిలో మిక్స్ డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు గణపయ్యతో కలిసి సందడి చేసిన వీళ్లలో నిమజ్జనం సమయంలో ఆ విచారం కనిపిస్తోంది’’ ఫీల్ అవుతున్నారు అని ట్యాగ్ చేసింది.
అరే.. అప్పుడే నీళ్లలో కలిపేయాల్సొస్తోందే! గణేషా ఏమనుకోవద్దు ప్లీజ్! అంటూ అమాయకంగా చూస్తున్న పిక్ నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మహేష్ తన సిల్వర్ జుబ్లీ మూవీ మహర్షి మూవీ కోసం బ్రేక్ కూడా తీసుకోకుండా వినాయకచవితి రోజు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. తన కిడ్స్ భక్తి శ్రద్ధలతో గణపయ్యకి చేసిన పూజలని దగ్గర నుండి చూసే అవకాశాన్ని మహేష్ మిస్ అయ్యారు.