చాలా కింది స్థాయి నుండి పెద్ద స్టార్స్ గా ఎదిగిన వారు వీరే !
these are the actors grown as zero to telugu star heroes
మనం ఒకటి అనుకుంటే…కాలం ఇంకోటి కలుస్తుంది.. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేద్దామని వచ్చిన వాళ్ళు… హీరోగా నటించి సూపర్ స్టార్స్ అయ్యారు… కొందరు హీరోయిన్లు అయితే… సైడ్ క్యారెక్టర్ గా చేసి టాలీవుడ్ లో అగ్ర తారలగా ఎదిగిన వారు కూడా ఉన్నారు… మరి ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరో చూద్దాం…
★ నాని
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో నాని ఒకరు… ఈయన మొదట ఢీ చిత్రానికి, రాధాగోపాలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత అష్టాచెమ్మ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.. ఆ సినిమా మంచి హిట్ సాధించడంతో…నానికి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడంతో వరుస సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు…

★ రవితేజ
1980 లోని కృష్ణవంశీ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు .. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్ లో నటిస్తూ… డైరెక్టర్ పూరి జగన్నాథ్ కంట పడ్డాడు… ఆయన రవితేజను ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు…ఆ తర్వాత రవితేజ తన నటనతో మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్నాడు…

★ విజయ్ సేతుపతి
ఈ పేరు ఎక్కువగా తెలుగు వాళ్లకు తెలియకపోయినా విజయ్ సేతుపతి తమిళంలో ఒక గొప్ప సూపర్ స్టార్.. మరి విజయ్ మొదట ధనుష్, కార్తి లాంటి హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేసి… క్రమక్రమంగా హీరోగా ఎదిగాడు

★ విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ కూడా మొదట చిన్న చిన్న సైడ్ రూల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో అద్భుతంగా నటించి.. సినిమాలో హీరోగా ఛాన్స్ లు కొట్టేశాడు

★ కాజల్
అందాల తార కాజల్ ఇండస్ట్రీకి రాగానే హీరోయిన్ కాలేదు.. ఆమె మొదట బాలీవుడ్లో “క్యూ హో గయా నాలో” ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది…

★త్రిష
ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అయిన త్రిష మొదట…ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన” జోడీ” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించింది…ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రావడంతో.. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది

★ శర్వానంద్
టాలీవుడ్ లో 25 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరో శర్వానంద్ …మొదట శర్వానంద్ శంకర్ దాదా ఎంబిబిఎస్, సంక్రాంతి వంటి చిత్రాల్లో సైడ్ రోల్స్ నటించి ప్రేక్షకులను అలరించారు… ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు…

★ సత్యదేవ్
ఈ హీరో మొదట చిన్న చిన్న సైడ్ రోల్స్ తో నటిస్తూ.. ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు
