Today Telugu News Updates
కొబ్బరి బొండాలు ఇస్తే చాలు …. కాలేజ్ ఫీజ్ అక్కడ కట్టనవసరం లేదు !

ఈ కరోనా కష్టకాలం లో వెనకటి రోజులు వచ్చాయనే చెప్పాలి, ఎందుకంటే వెనకట డబ్బులు లేని సమయంలో ఒకరికి ఒకరు వస్తూ రూపంలో, ధాన్యం రూపంలో ఇచ్చి వారి అవసరాలను తీర్చుకుంటూ కలం వెళ్లదీసేవారు.
ఇపుడు అదే పరిస్థితి ఇండోనేషియాలో వచ్చింది. కరోనా వల్ల వారు పండించిన కొబ్బరి కాయలను వేరే ప్రాంతాలకి తీసుకెళ్లి డబ్బులు సంపాదించే అవకాశం లేకపోవడంతో, వీరి పిల్లల ఫీజులు కట్టలేక పోతున్నారు.
ఈ విషయం అర్థం చేసుకున్న కాలేజ్ యాజమాన్యం నగదుకు బదులుగా వారు పండించిన పంటలను, కొబ్బరికాయలను ఫీజ్ రూపంలో తీసుకోడానికి ముందుకు వచ్చారట.
కాలేజ్ యాజమాన్య తీసుకున్న ఈ నిర్ణయానికి అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.