Viral news in telugu

ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఇంకొకరిని కోరుకుంది… చివరికి జరిగిన పరిణామం ఇదే

The young couple deeply in love

The young couple deeply in love ఆ యువజంట  కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా  ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి జరిగిన కొన్ని రోజులకే  ప్రేయసిలో  మార్పు కనిపించింది. అదేంటంటే… పెళ్ళికి ముందు అతడు చేసే ఉద్యోగం నచ్చింది, పెళ్లి జరిగాక అదే ఉద్యోగంపై ఆ ప్రేయసికి విరక్తి పుట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని బోరబండ కు చెందిన సాయికిరణ్ అనే యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రదేశానికి చెందిన బీటెక్ చదువుతున్న యువతిని  ఇష్టపడ్డాడు. ఇష్టపడటమే కాదు ఆ అమ్మాయి చిత్రాన్ని యువకుడు తన చేతిపై టాటూ కూడా వేయించుకున్నాడు. ఇలా ఒకరినొకరు 2 సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలారు. వీరి ప్రేమ పెద్దలకు తెలవడంతో, ఇరువురిని గట్టిగానే  మందలించారు. ఇలా వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటినుండి పారిపోయి మరీ పెళ్లిచేసుకున్నారు.

కొన్ని రోజులు కాపురంచేశాక ఆ యువతికి , సాయికిరణ్ చేసే ఫుడ్ డెలివెరి బాయ్  జాబ్ నచ్చలేదు.  పెళ్ళికి ముందు కనిపించిన ప్రేమ, పెళ్లి తరవాత ఆ యువతిలో కనిపించలేదు. ఎప్పుడు ఆ యువతీ సాయి కిరణ్ చేసే జాబ్ ను చిన్న చూపు చూసేది. ఎదో ఒక కాణంతో కించపరిచేది. ఇలా వీరి ఇద్దరి మధ్య గొడవలు మొదలై తారాస్థాయికి చేరాయి. చివరికి ఆ యువతి తన అమ్మగారింటికి వెళ్ళిపోయింది. సాయి కిరణ్ ఎంతో కాలంగా ఆ యువతిని తన ఇంటికి తీరుకురావాలని ప్రయత్నం చేసాడు.

ఇంకో విషయం ఏంటంటే ఆ యువతి మరొక అబ్బాయితో చనువుగా ఉందనే విషయం తెలిసి కిరణ్  తీవ్ర మనస్తాపం చెంది  ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని వేలాడుతుండగా కొంతమంది అతనిని చూసి, కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ సోమవారం తెల్లవారుజామున మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్నీ సాయి కుమార్ సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు తెలపగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button