బైకర్‌ను లిఫ్ట్ అడిగిన మహిళ.. ఇంతలోనే ఇలా జరిగిపోయింది

తెలంగాణాలో మెదక్ జిల్లాకు చెందిన ఒక మహిళ ద్విచక్ర వాహనంపై నుండి పడి మృత్యువాత పడింది. ఒక మహిళా అయి ఉండి లిఫ్ట్ అడగడటం గమనార్హం. ఈ ఘటన కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కన్నారం భూషణం భార్య పుష్పమ్మ , అత్త దుర్గమ్మతో కలిసి గ్రామ శివారులో తాళ్లగడ్డ తండా వెళ్లే రోడ్డు మార్గంలో వారికి ఉన్న పొలంలో కూరగాయలు కోసేందుకు బయలుదేరారు. కూరగాయలు కోయడం అయిపోయాక ఇంటికి బయలుదేరే సమయంలో .. అదే గ్రామానికి చెందిన రాయెల్లి ప్రభాకర్ బండి పై వెళ్తున్నాడు. పుష్మమ్మ ప్రభాకర్ ను లిఫ్ట్ అడగగా… పుష్పమ్మను బైక్‌పై కూర్చొని కూరగాయల గంప తలపై పెట్టుకుంది. జాగ్రత్త్తగా పోనీ అయ్యా అని కూడా కోరింది.
అయితే, కొద్దిదూరం వెళ్ళగానే ఏమైందో ఏమో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరూ నడి రోడ్డుపై పడిపోయారు. పుష్పమ్మకు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయింది. పుష్పమ్మ భర్త భూషణం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాహనాన్ని అజాగ్రత్తగా నడిపినందుకు ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.