పూరి జగన్నాథ్ ని కంటతడి పెట్టించిన వీడియో… వైరల్ !

Puri Jagannadh video : డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరీ తాజాగా ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో ఒక థియేటర్ యజమాని పాడుబడ్డ బూతుబంగళాకు వెళ్లినట్టు, తన థియేటర్ కి వెళ్లి థియేటర్‌ని ఓపెన్ చేయడం, లోపల కార్మికులు థియేటర్‌ని శుభ్రం చేస్తుండటం, థియేటర్‌ని తెరిచే సమయంలో ఆ రోజులు మళ్లీ వస్తాయా..? దేవుడికే తెలుసు అని యజమాని అనుకోవడం..థియేటర్ లో ఉన్న సీట్లు, ప్రొజెక్టర్ అన్నింటిని కొత్తగా చూడటం, ఒక్కొక్కరుగా జనాలు థియేటర్ లోపలికి వస్తుండటం చూపించారు.
థియేటర్‌లోకి మళ్లీ రండి అంటూ కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్, దర్శన్ పలువురు ఈ వీడియోతో ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు .
ఇక ఈ వీడియోని షేర్ చేసిన పూరీ.. ఈ వీడియోను చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయని . మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్లు ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్. మన అమ్మ అని పూరి తన భావోద్వేగాలను అభిమానులతో పంచుకున్నారు .