Viral news in telugu

Currency Rain : ఒక దేశంలో కురిసిన కాసుల వర్షం…ఏరుకోలేక ఇబ్బందిపడ్డ అక్కడి జనం .. వీడియో వైరల్

Currency  Rain

Currency  Rain :   చేపల వర్షం..చూశాం , వడగళ్ల వర్షం చూశాం .. కానీ మన పక్క దేశం పాకిస్తాన్ లో ఏకంగా కాసుల వర్షం కురిసింది. అవును ఇది ఇజం .. ఆ కాసులను, నోట్లలను ఏరుకోలేక అక్కడి ప్రజలు డీలా పడ్డారు, కానీ వర్షం మాత్రం ఒక గంట పాటు కురిసింది.

అసలు విషయానికి వెళ్తే…

మన పక్క దేశమైన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నరోవాల్‌లో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి చాలా మంది జనం తరలి వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రజలు భోజనాలు చేసి కూర్చొని ఉన్నారు.  వధువువరులు ఇద్దరూ పెళ్లి జరిగాక ఇంటి ముందు నిల్చోబెట్టి వారిపై  నోట్ల వర్షం, ఆ ఇంటి సభ్యులు కురిపించారు. ముందుగా ఆవి చిత్తుకాగితాలు అనుకున్నారు అక్కడివారందరు. తీరా చుస్తే అవి నికాసైనా నోట్లు , అవి చుసిన అక్కడి జనం డబ్బు, డబ్బు అంటూ ఎగబడి మరి వాటిని ఏరుకున్నారు .

ఈ ఘటనను అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. మరి ఆ నోట్ల వర్షం వాల్యూ ఎంతనుకుంటున్నారు, అవి అక్షరాలా 2 లక్షల రూపాయలు. అసలే ప్రజలు కరోనా వల్ల డబ్బులేక ఇబ్బంది పడుతూ ఉంటే , కొందరి దగ్గర పడేసేలా డబ్బు ఉందా అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

మరి వీరేమైనా రాజవంశానికి చెందినవాళ్ల అని ఆలోచిస్తున్నారా… కానే కాదు..  పెళ్లి కొడుకు సోదరుడు అమెరికాలో ఉంటున్నాడు.. పెళ్లికోసమే పాకిస్థాన్ వచ్చాడట .. తన సోదరుడి పెళ్ళికి వచినవారందరు సంతోషంగా ఉండాలని ఇలా చేసానని చెప్పాడట.. ఏదేమైతేనేమి మొత్తానికి సోదరుడి పెళ్లి గ్రాండ్ గా జరగడంతో పాటు .. బంధువుల మొహంలో ఆనందం కూడా చూసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button