Today Telugu News Updates
టాయిలెట్లను వాడడానికి కూడా టైమింగ్ …. ఇదేం కలికాలం రా బాబు !

ఆ సంస్థలో ఉద్యోగులకు కేటాయించిన సీట్లమీద కంటే, టాయిలెట్ సీట్లమీద ఎక్కువగా గడుపుతున్నారన్నా చర్చ ఎప్పటినుడో సాగుతుంది. ఇపుడు తాజాగా ఆ సంస్థ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.
అదేంటంటే మీరు టాయిలెట్ కి వెళ్తే మేము కేటాయించిన టైం లోనే ఉపయోగించుకోవాలి అన్నట్టు టైమర్ ని పెట్టింది.
ఎందుకంటే ఉద్యోగులు ఎక్కువసేపు టాయిలెట్ లో గడపడం వల్ల అనుకున్న టైం కి పనులు పూర్తీ కాలేకపోతున్నాయట.
ఐతే కొన్ని కంపెనీలు టాయిలెట్లను మొబైల్ ని అలోవ్ చేయవు, కానీ చైనాకి చెందిన ఒక సంస్థ మాత్రం ఎక్కడాలేని నిబంధన పెట్టడంతో ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారట.
ఐతే ఈ విషయం పై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో, ఆ కార్యాలయంలో చాలా తక్కువ టాయిలెట్లు ఉన్నాయి.ఉద్యోగులకు అదనంగా ఎన్ని టాయిలెట్లు అవసరమవుతాయో తెలుసుకోదానికి టైమర్ లని బిగించామని సంస్థ తేలింది.