Today Telugu News Updates

నిజమైన కాకి కథ… నీళ్లకోసం బాటిల్ లో రాళ్ళువేసి… వీడియో వైరల్ !


The story of a real crow

మనం చదువుకున్న పుస్తకంలో ఒక కాకి కథ గురించి చదువుకున్నాం . అదేంటంటే అనగనగా ఓ కాకి దానికి బాగా దప్పిక వేసింది. నీళ్ల కోసం చాలా చోట్ల తిరిగింది. కానీ, దానికి ఎక్కడా చుక్క నీరు కూడా దొరకలేదు. కానీ ఇలా తిరుగుతూ ఉన్న కాకి కి ఒక  కుండలో నీళ్లు కనిపించాయి. కానీ దాని ముక్కు చిన్నది గా ఉండడం  వల్ల కుండ అడుగున ఉన్న నీటిని తాగలేకపోయింది.

ఏం చేయాలా.. అని ఆలోచిస్తున్న టైమ్ లో .. దానికో తెలివైన ఆలోచన తట్టింది . వెంటనే అది ఒక్కో రాయి కుండలో వేయడం మొదలుపెట్టింది. చివరికి.. రాళ్లు బరువు వల్ల కుండలో నీరు పైకి వచ్చాయి. ఆ నీటిని తాగి కాకి తన దాహాన్ని తీర్చుకొని ఎగిరిపోయింది.

ఈ కథ లో ఉన్నట్టే ఒక కాకి జాతికి చెందిన మాగ్ పి  అనే పక్షి తన దాహాన్ని తీర్చుకోడానికి రాళ్లను ఒక బాటిల్ లో వేసి పై కథను మల్లి మనకు గుర్తు చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button