Today Telugu News Updates
వంటచేయలేదన్న కోపంతో తల్లిని,చెల్లిని కడతేర్చిన కొడుకు !

మొబి పరిధి జికియారి గ్రామానికి చెందిన దేవ్షీ భాటియా(40) తల్లి కస్తూర్ భాటియా, చెల్లెలు సంగీత భాటియాతో కలసి నివాసముంటున్నాడు. రాత్రి భోజనం వండే విషయమై తల్లీకూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. నేను తిరిగొచ్చేలోపు ఎవరో ఒకరు వంట చేయండంటూ చెప్పేసి దేవ్షీ భాటియా బయటికి వెళ్లిపోయాడు.
వంట నువ్వు చేయనంటే నువ్వు చేయు అంటూ తల్లీకూతుర్లు పూర్తిగా వంట చేయడం మానేయడంతో ఆకలితో వచ్చిన కొడుకు కోపంతో రగిలిపోయి తల్లిని, చెల్లిని దారుణంగా నరికి చంపేశాడు.
అత్యంత అమానుష ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. కనిపెంచిన తల్లి, తోడబుట్టిన సోదరి అనే కనీస కనికరం చూపకుండా దారుణంగా చంపేశాడు .
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు .