Today Telugu News Updates
మరో ప్రేమోన్మాది ఘాతుకం…. బాధితురాలు పరిస్థితి విషమం !

విశాఖ నగరంలో థామస్ వీధిలోని ప్రియాంక, శ్రీకాంత్ లు ఏడాది నుండి స్నేహంగా ఉండగా, కొంతకాలంనుండి శ్రీకాంత్ ప్రవర్తనను గమనించిన ప్రియాంక తల్లి శ్రీకాంత్ నుండి దూరంగా ఉండాలని ప్రియాంకని సూచించింది.
తనని దూరంగా పెడుతుందనే కక్షతో శ్రీకాంత్ కొంతకాలం నుండి బాధపడుతూ వచ్చాడు. ఆ బాదలోనుండి పుట్టిన కోపంతో ప్రియాంకని పథకం ప్రకారం ప్రియాంక ఇంట్లోకి చొరబడి గొంతు కోసి తన గొంటుకూడా కోసుకోవడంతో, వీరిని కుటుంబసభ్యులు హుటాహటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు తెలిపిన సమాచారం మేరకు ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండగా, శ్రీకాంత్ సేఫ్ సైడ్ ఉన్నాడని చెప్పారు.
ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.