Viral news in telugu

ముక్కులో రూపాయి బిళ్ళ … 50 ఏళ్ళ తర్వాత బయటికి !

viral news

పిల్లలు చిన్నపుడు ఎంత అల్లరి చేస్తారో , అంతే తొందరగా ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు నోట్లో, ముక్కులలో  ఏదిపడితే అది పెట్టుకొని ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు.

తాజాగా ఒక వ్యక్తి తన చిన్నప్పుడు ఒక రూపాయి బిళ్ళను ముక్కులో పెట్టుకొని , ఆ విషయమే మరచిపోయాడు.

ఈ వింతయిన సంఘటన రష్యాలోని జరిగింది. తనకి 50 ఏళ్ళ తరవాత శ్వాసలో ఇబ్బంది రావడంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. తన బాధని డాక్టర్లకి వెల్లడించగా సిటీ స్కాన్‌లో అతడి ముక్కులో ఒక వస్తువు ఉన్నట్లు గమనించారు .

ఈ విషయం పేషేంట్ కి తెలపడంతో తాను చిన్నప్పుడు ఆడుకుంటూ ఒక నాణాన్ని ముక్కులో పెట్టుకున్నానని వైద్యులకు తెలిపాడు. దీనితో ఎండోస్కోపిక్ శస్త్ర చికిత్సతో వైద్యులు ఆ నాణాన్ని బయటికి తీశారు.

అలాగే భవిష్యత్తులో ఊపిరి తీసుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తికి వైద్యం అందించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button