News

తెలంగాణలో చలి విపరీతంగా పెరగడానికి గల కారణాన్ని వివరించిన…హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం గారు !

The reason for the extreme cold in Telangana

హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం గారు మాట్లాడుతూ తెలంగాణ వైపుగా ఈశాన్య, ఉత్తర దిశల నుంచి బలమైన చలి  గాలులు వీస్తున్నాయని, అదేవిదంగా సెంట్రల్ ఇండియా పరిసర ప్రాంతంలో ఒక యాంటీ సైక్లోనిక్  ఉండటం వలన తెలంగాణ మీదుగా చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయని నాగరత్నం గారు వివరించారు.

ఈ కారణం వల్లనే ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో  ఉష్ణోగ్రతలు  పడిపోతున్నాయని డైరెక్టర్ వెల్లడించారు. అదేవిదంగా రానున్న మూడు,నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని , ముక్యంగా ముసలివారు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button