Political News
ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్

Hyderabad : ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని అందుకనే ఢిల్లీ కి బయలుదేరాడని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. ఇక నుండి కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించాడు .
మిడ్ మానేరు ముంపు కు గురిఅయిన బాధితులు కోర్టుల చుట్టూ తిరిగేలా ఈ ప్రభుత్వం చేస్తుందని. ఇప్పటికైనా కళ్ళు తెరచి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ బాధితుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు జనవరి మొదటి వారంలో మిడ్ మానేరు నుంచి గవర్నర్ కార్యాలయానికి పాదయాత్ర చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు.