Today Telugu News Updates
తీసుకున్న అప్పు తీర్చలేదని… ఒక యువతీ తీసుకున్న దారుణమైన నిర్ణయం !

విశాఖ పట్నం: ఈ మధ్యన ఆన్లైన్ లో వస్తున్నా యాడ్స్ ద్వారా ఒక యాప్ ని సంప్రదించి ఆ యువతీ రూ . 40 వేలు తీసుకున్నది . ఆ అప్పును తీర్చాలని అప్ యాజమాన్యం యువతిని కోరడంతో, ఎలాగైనా అప్పు తీర్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.
తీసుకున్న అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో కొన్ని రోజులు యాప్ నుండి వచ్చే కాల్స్ కి స్పందించడం మానేసింది. కొన్ని రోజులకు యాప్వాళ్ళు మీరు రెస్పాండ్ కాకపోతే లీగల్ గా వీళ్ళాల్సి వస్తది అని వార్ణింగ్ ఇవ్వడంతో భయాందోళనకు గురిఅయిన ఆ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.