Viral news in telugu

పెళ్ళి చేసుకున్నోడు నచ్చలేదు, ప్రేమించినవాడు వచేయమంటున్నాడు.. ఏంచేయమంటారు…!

who marries does not like

Q . మేడమ్ నమస్తే.. నేను ఒక అందమైన అబ్బాయిని ప్రేమించాను. అతనికి అందంతో పాటు ఉద్యోగం, మంచితనం, సంస్కారం అన్ని బాగున్నాయి. అతనికి నేనంటే ప్రాణం, అన్ని విషయాలలో కలిసిపోయాం, మా పెళ్ళికి మా కుటుంబం వారు ఒప్పుకోవడం లేదు. అమ్మ ఆరోగ్యంకూడా బాగాలేదు. మా చుట్టాలందరు నన్ను మార్చి మా బావకు ఇచ్చి పెళ్ళిచేసారు. నేనుకూడా ఉద్యోగరీత్యా బావకు దూరంగానే ఉన్నాను. నన్ను ప్రేమించిన వ్యక్తి నన్ను ఇప్పటికి రా అని పిలుస్తున్నాడు, నన్ను మళ్ళి  పెళ్లికూడా చేసుకుంటానంటున్నాడు  ఇపుడు నన్ను ఏంచేయమంటారు. – ఒక సోదరి.

జ . ఇది ఒక్కరి సమస్య కాదు 3 కుటుంబాలకు సంబందించిన ఒక పెద్ద సమస్య, ఏ చిన్న తప్పుచేసిన 3 కుటుంబాలు నవ్వుపాలు అవుతాయి.  మీరు  ఏ నిర్ణయమైనా తీసుకోడానికి తొందర పడకండి. మీరు తీసుకొనే నిర్ణయం తో 3 కుటుంబాలు ప్రభావితం అవుతాయని గుర్తుంచుకోండి. మీరు వేరే వ్యక్తిని ప్రేమించిన విషయం మీ బావకు తెలుసు కాబట్టి, అతనితో మాట్లాడి నిర్ణయం తీసుకోండి.

అలాగే మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి , అతని కుటుంబం మిమ్మలి యాక్సెప్ట్ చేస్తుందా అనే విషయాన్నీ కచ్చితంగా తెలుసుకోండి.  ఈ విషయంలో ఒక్కసారి            

 తప్పటడుగువేశారంటే జీవితంలో కూడా కోలుకోలేని దెబ్బ తగిలించుకున్నవారవుతారు.  ఎవరూ బాదపడాల్సిరాకూడ నిర్ణయం తీసుకుంటే మీకే మంచిది. డా || సైకాలజిస్ట్ 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button