Tollywood news in telugu

అభిమానుల నోట్లో ఇరుక్కుపోయిన ముద్దుగుమ్మ !

పూజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సౌత్ ఇండియా సినిమా వాళ్ళ గురించి హేళనగా మాట్లాడుతూ, సౌత్ ఇండియా అభిమానుల నోట్లో తన పేరు ఇరుక్కునేలా చేసుకుంది.

పూజ అనే మాటలు  అభిమానుల గుండెల్ని ముక్కలు చేసేలా ఉండడంతో కొంత నిరాశకు లోనయ్యారు.

అస‌లు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు లైఫ్ ఇచ్చిందే సౌత్ ఇండియా అనే విష‌యాన్ని మరచిపోయి మాట్లాడటం ఏంటని షోషల్ మీడియాలో పూజ కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే  పూజ ఇచ్చిన ఇంటర్వ్యూ లో  సౌత్ ఇండియ‌న్ సినిమా వాళ్లు న‌డుము మ‌త్తులోనే ఉన్నారని, మిడ్ డ్రెస్‌ల‌లో త‌మ‌ను చూడాల‌ని కోరుకుంటారని చెప్పుకొచ్చారు. పూజా న‌వ్వుతూ ఈ మాట‌లు చెప్పిన‌ప్ప‌టికీ అభిమానులు ఈ  విష‌యం చాలా సీరియ‌స్ తీసున్నారు.

సౌత్ ఇండియా వ‌ల్లే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో  పాటు డ‌బ్బు  సంపాదిస్తూ …ఇప్పుడు తిన్నింటి వాసాల‌ను లెక్క‌పెడుతోంద‌ని తెలుగు సినీ అభిమానులు  కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button