Tollywood news in telugu

Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !

Vakeel Saab Movie Review

నటీనటులు: పవన్ కళ్యాణ్ , శృతిహాసన్ , అంజలి,  నివేద థామస్, అనన్య

నిర్మాతలు: బోణి కపూర్, దిల్ రాజు 

సంగీత దర్శకుడు : తమన్

డైరెక్టర్ : వేణు శ్రీరామ్

Vakeel Saab Movie Review : గత 3 సంవత్సరానుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెరపై కనుమరుగై , రాజకీయాలలో  తీరికలేకుండా గడిపాడు. ఇపుడు తాజాగా ఒక పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘వకీల్ సాబ్’ గా దర్శనమిచ్చాడు. ఈ సినిమా  బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. ఇక ఈ సినిమా  చాలా గ్రాండ్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో  పవర్ స్టార్ లాయర్ గా ఒక పవర్ ఫుల్ పాత్రతో ఆకట్టుకున్నాడు. గత  అర్ధరాత్రి నుంచే థియేటర్స్  ముందు ఊహకందని రీతిలో పవన్  అభిమానుల సందడి నెలకొంది.

ఇక మరి ఇపుడు సినిమా విషయాలు మాట్లాడుకుంటే…

కథ :

మహా నగరం హైదరాబాద్ లో నివాసముండే పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), అనన్య (అనన్య) అనే ముగ్గురు యువతులు ,  ఒక రోజు   పార్టీకి అని బయలుదేరి అనుకోని ఘటనలో చిక్కుకుంటారు.. అదేంటంటే.. అక్కడ పార్టీ లో  ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి  వంశీ (వంశీ కృష్ణ) ను ఒకానొక సందర్భంలో గాయపరుస్తారు. అలా  గాయపరచగానే అక్కడ ఒక  గందరగోళా పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయంపై ఆ ముగ్గురు యువతులపై కేసు నమోదు చేయబడుతుంది. ఇక చేసేది ఏంలేక ఆ అమ్మాయిలు న్యాయం కోసం పోరాడే ఒక పవర్ ఫుల్ లాయర్ ని అంటే  లాయర్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్ ) వద్దకు చేరుకొని, ఆ పార్టీ లో జరిగిన పరిస్థితిని వెల్లడిస్తారు. ఇక మరోవైపు  ఆ ముగ్గురు  అమ్మాయిల్ని కేసులో ఇరికించడానికి లాయర్ నందా(ప్రకాష్ రాజ్) శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఈ పరిణామంలో పవర్ ఫుల్ లాయర్  సత్యదేవ్ కేస్ ను ఎలా ఎదుర్కొన్నాడు..? ఆ యువతులకు సత్యదేవ్ ఎలా న్యాయం చేస్తాడు ..? ఈ కేసు నుంచి ముగ్గరు యువతులు  సేఫ్ అవుతారా ..? లేదా..? అనే విషయం ఫై కథ కొనసాగుతుంది.

కథ విశ్లేషణ :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తరువాత , రెట్టింపు పవర్ ని ఈ సినిమాలో చూపించాడు.  అలాగే  తన బాడీ లాంగ్వేజ్ తో  అభిమానులను కట్టిపడేసాడు.  పవర్ ఫుల్ లాయర్ గా ఒక పవర్ ఫుల్ డైలాగ్స్ తో సినిమా థియేటర్స్ ని దద్దరిల్లేలా చేశాడు. ఇక  తనదైన స్టైల్ ను జోడించి ప్రేక్షకుల గుండె దడను పెంచేసాడు. తన ఒక్కొక్క డైలాగ్ ప్రజలను, సమాజాన్ని ఆలోచనలో పడేసింది.  ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో కనిపించే  కోర్టు సన్నివేశాల్లో పవన్ తన విశ్వరూపాన్ని  బయటపెట్టాడు.   ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ సెట్ అయింది  అని అంటున్నారు ప్రేక్షకులు. అలాగే ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా వారి వారి పాత్రల్లో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  అదేవిదంగా ఎప్పటిలాగే తన నటనతో  ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను  ఆకట్టుకున్నాడు. అలాగే  వంశీ కృష్ణ మరియు అమిత్ శర్మలు వారి పాత్రలకు న్యాయం చేసారు.

ఉత్తరాది చిత్ర పరిశ్రమ బాలీవుడ్ లో ‘పింక్’ సినిమా ప్రభంజనం సృష్టించడంతో , ఆ సినిమాకు తగ్గట్టుగా , అలాగే పవన్ కళ్యాణ్ రేంజ్ కి ఏ  మాత్రం తీసిపోకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎక్కడ మెయిన్ పాయింట్ ను మిస్ అవ్వకుండా  టాలీవుడ్ లో రీమేక్ చేసి ప్రజల ఊహకు అందనివిదంగా  తెరకెక్కించారు  దర్శకుడు వేణు శ్రీరామ్. అదేవిదంగా  తమన్ మరోసారి తన మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్  ఎలివేషన్ సీన్స్ వస్తున్నపుడు తన దైన స్టైల్ లో  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించి  ఆకట్టుకున్నాడు తమన్. ఇక  కెమెరా విషయానికి వస్తే… చాల డిఫరెంట్ గా అద్భుతమైన క్లారిటీతో , వాస్తవానికి దగ్గరగా కనిపించేలా పనితనం కనిపించింది. ఈ విషయాలు మొత్తం కలిపితే ఈ సినిమాను ప్రేక్షకులు  అగ్రస్థానంలోకి ఖచ్చింతంగా తీసుకెళ్తారు.

సినిమాకు బలమైన  పాయింట్స్ :

స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.

యాక్షన్ మరియు ఎమోషన్ సన్నివేషాలు ఎంతో ఆకట్టుకుంటాయి.

నటీ నటుల ఫర్ఫార్మెన్స్ చాల బాగుంది.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఇరగదీశాడు.

సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది.

సినిమాకు బలహీన  పాయింట్స్:

 ప్లాష్ బ్యాక్ కాస్త బలహీనంగా ఉండటం.

ఇక చివరిగా చెప్పేది ఏంటంటే …   పవన్ కోర్టులో వాదించే తీరు కచ్చితంగా చూడాల్సిందే.. మరో మాటలేదు..

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button