షూటింగ్ పూర్తీ చేసుకున్న ‘కోతికొమ్మచ్చి’ టీమ్ !

వేగేశ్న సతీష్ డైరెక్షన్ లో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా చేస్తున్న ఎంటర్టైనర్ చిత్రం ‘కోతి కొమ్మచ్చి’. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కరోన పీక్స్ టైం లో ఉన్న సినిమా షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజుల్లోనే అవుట్ డోర్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. నవంబర్ 3న మొదలైన కోతికొమ్మచ్చి షూటింగ్ డిసెంబర్ మొదటి వారంతో పూర్తయింది. ఇంకా ఒక సాంగ్ మిగిలి ఉంది.
దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ ” లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి పర్మీషణ్ ఇచ్చిన వెంటనే ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసాము అని వెల్లడించాడు. షూట్ మొత్తం అమలాపురం , విశాఖపట్నం , రాజమండ్రి లో ఎలాంటి బ్రేక్ లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిపాము అని తెలిపారు.
మాకు సహకరించి సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది,ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని తెలిపాడు.