చికెన్ కోసం 60 రోజులకు పైగా కోమాలో ఉన్నవ్యక్తి లేచి కూర్చున్నాడు !

ఒక వ్యక్తి కోమాలోకి వెల్లాడఁటే, అతను తిరిగి నార్మల్ స్థితిలోకి ఎప్పుడు వస్తాడో ఎవరు చెప్పలేరు. కానీ తనకు నార్మల్ కావడానికి అటు డాక్టర్లు, ఇటు కుటుంబ సభ్యులు ప్రతీ నిమిషం ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఈ సందర్భంలో కోమాలోకి వెళ్లిన వ్యక్తి చెవిదగ్గర, తనకు ఇష్టమైన వారిగురించి మాట్లాడటం, ఇష్టమైన వస్తువులు తెచ్చామని చెప్పడం, ఇష్టమైన ఫుడ్ తెచ్చామని చెప్పటం చేస్తూవుంటారు ఎందుకంటే వైద్యం ద్వారా కానీ పనులు భావోద్వేగాలతో సాధ్యం కావచ్చు .
ఇక డాక్టర్లు విషయానికి వస్తే పేషేంట్ ని ప్రతీరోజు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో అబ్సర్వ్ చేస్తూ ఉంటారు.
తైవాన్ కి చెందిన చియూ అనే 20 ఏళ్ళ కుర్రవాడు రెండు నెలలక్రితం ఆక్సిడెంట్ లో తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇతను ప్రమాదానికి గురి అయినపుడు లివర్ ,కిడ్నీ, దెబ్బతినడంతో పటు ప్లీహం లో చీలికలు ఏర్పడ్డాయి. ఇక ఇతని కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు.
కానీ చియు కోమాలో కూడా ఊపిరి పీల్చుకుంటూ ఆరోగ్యాంగా ఉండటంతో మళ్ళీ ఆ కుటుంబం లో ఆశలు చిగురించి ట్రీట్మెంట్ ని కొనసాగిస్తూ ఉన్నారు.
ఆ సమయంలో చియు స్నేహితుడు ఒకరు వచ్చి నీకు ఇష్టమైన ‘చికెన్ ఫిల్లెట్’ తినడానికి వెళ్తున్నా, నీకూ కూడా తేవాలా ’’ అని సరదాగా చెవిలో చెప్పగానే చియు శరీరంలో కదలిక వచ్చి కొన్ని గంటల్లోనే లేచి కూర్చున్నాడు.