Tollywood news in telugu
కంగానా ఆఫీస్ కూల్చివేతపై విషయం లో హై కోర్టు ఏమందో తెలుసా?

కంగనా గతం లో తన ఆఫిస్ కూల్చివేత విషయంపై కోర్టులో పిటిషన్ వేయగా తాజాగా కోర్టు తీర్పు వెలువడింది.
ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసును బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చినందుకు ముంబై హైకోర్టు ఒక దుశ్చర్యగా అభివర్ణించింది. అన్ని అనుమతులతో చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వెల్లడించింది .
కంగనాకు జరిగిన పూర్తి నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాడి న్యాయస్థానంలో కంగనా విజయం సాధించిందని తన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.