Tollywood news in telugu
30 ప్లస్ జాబితాలోకి ఎంటరైన హీరోయిన్ !

ఆరు సంవత్సరాల క్రితం ‘ ఊహలు గుసగుసలాడే’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ,ఇప్పటివరకు బ్రేక్ లేకుండా నటిస్తూనే వుంది రాశీ ఖన్నా కానీ ఇప్పటివరకైతే అయితే మంచి బ్రేక్ మాత్రం రాలేదు. కానీ సన్నగా, పొడవుగా మెరుపుతీగలా వుండే రాశీఖన్నాకు గ్లామర్ లోటు అయితే లేదు. నటన కూడా ఒకె. కానీ అదృష్టమే కొంచం తక్కువైతున్నట్టు ఉంది .
సినిమా హీరోయిన్లు అంటే టీనేజ్ లో వచ్చి అలా అలా పాతికేళ్ల వరకు కెరీర్ సాగుతూనే వుంటుంది. ఆపై నుంచి ఇక మెలమెల్లగా అవకాశాలు తగ్గడం మొదలవుతుంది.
అయితే గ్లామర్, టాలెంట్, అదృష్టం ఆలంబనగా థర్టీ ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా వారి కెరీర్ ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ జాబితాలో అనుష్క, నయనతార, శ్రేయ, కాజల్ ఇంకా ఈ జాబితా ఇంకొంత మంది హీరోయిన్ లు ఉన్నారు . అయితే థర్టీ ఫైవ్ ఉన్నవాళ్లే.
ఇప్పడు థర్టీ ప్లస్ హీరోయిన్ల జాబితాలోకి రాశీఖన్నా కూడా వచ్చేసింది.