Tollywood news in telugu
మీటూ వలలో ది గ్రేట్ మణిరత్నం …. ఏంజరిగింది !

maniratnam సినీ ఇండస్ట్రీలోని ఒక దిగ్గజ దర్శకుడిగా ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి మణిరత్నం గారు.
మీటూ కి మణిరత్నానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, లైంగిక ఆరోపణలకు గురి ఐన ఒక సింగర్ కి మణిరత్నం ప్రాజెక్టు లో అవకాశం ఇవ్వడమే నేరం అయింది .
కోలీవుడ్ కి చెందిన సింగర్ చిన్మయి గతంలో మీటూ విషయంలో తన గొంతును వినిపించి ఎంతో పాపులర్ అయింది .
మణిరత్నం చేసిన పని కి చిన్మయి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అదేంటంటే లైంగిక ఆరోపణలకు గురి అయిన సింగర్ కార్తీక్ ని దర్శకుడు మణిరత్నం ‘నవరస ‘ అనే ప్రాజెక్టులో అవకాశం ఇవ్వడంతో చిన్మయి ఆగ్రహానికి గురిఅయింది.
మాలాంటి వాళ్ళు పనులులేక ఇబ్బంది పడుతుంటే, కార్తీక్ లాంటి సమాజానికి కీడుచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం ఏంటని మణిరత్నం ని నిలదీసింది.
చిన్మయి ప్రశ్నలకు మణిరత్నం ఎలాంటి సమాధానం ఇవ్వనున్నాడో చూడాలి.