News
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్… ఉచిత శిక్షణ ఉద్యోగం ఇవ్వనున్నారు

ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికి ఇది మంచి శుభవార్త అని చెప్పాలి. SUNNY OPOTECH INDIA PVT LTD అనే కంపని ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం ఇవ్వనుంది. ఈ మేరకు AP ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.
B.Tech లో ece ,eee ,mech ,eie పూర్తీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించింది. ఇందుకుగాను అభ్యర్థులు 60% మార్కులు పొంది ఉన్నవారే ఈ ఉద్యోగాలకు అర్హులని వెల్లడించింది.
అదేవిదంగా 2018, 2019 లో పాసైన వారికీ ఇందులో అవకాశం ఉందని తెలిపింది. ఈ జాబ్ లో జాయిన్ అయినవారికి 14,000 వేయిల వేతనం ఉండనుంది. మొత్తం 60 పోస్టులకు ఈ ప్రకటన విడుదల చేశామని స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది.