Viral news in telugu

స్నేహితుడు కుదిర్చిన సంబంధమేకదా అని పెళ్లి చేసుకున్నాడు… చివరికి 3 షాక్ లు తగిలాయి…!

relationship

ఈడొచ్చిన కొడుకు, కానీ కూతురు కానీ ఇంట్లో ఉంటె,  ఆ ఇంటి తల్లిదండ్రులకు  ఎలాంటి  పెళ్లి ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ పిల్లల్ని ఒక ఇంటివారిని చేయాలనీ బాధ్యత గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక కొడుకు ఉంటె కొంత నెగ్లెక్ట్  జరుగుతుంది పెళ్ళివిషయంలో , చివరికి వయసు పెరుగుతుంటే  టెన్షన్ మొదలై, తల్లిదండ్రులు అతనికి అమ్మాయి బాగుంటే చాలు అని పెళ్ళిచేస్తూ  ఉంటారు కొందరు. ఇలాంటిదే జరిగింది ఒకటి …ఎక్కడంటే…   కాన్పూర్ దేహత్ జిల్లాలోని దేవీపూర్ గ్రామంలో ఉన్న శివ్ నరైన్ తల్లిదండ్రులు  కొడుకు పెళ్లి కోసం ఆరాటపడుతున్న సమయంలో శివ్‌ నరైన్ స్నేహితుడు కైలాష్ గమనించి. శివ్‌ కు ఒక సంబంధాన్ని చూసాడు.

అయితే.. బీహార్‌కు చెందిన ఆ యువతి , పేద కుటుంబానికి చెందినది.  పెళ్లి చేసుకునేందుకు కూడా ఆమె వద్ద డబ్బుల్లేవని  శివ్ కు  కైలాసనాథ్ చెప్పాడు. దీంతో.. తన పొలంలో కొంత అమ్మగా వచ్చిన 3 లక్షలను శివ్ , కైలాష్ కు  ఇచ్చాడు. దీనితో ఆ బీహార్ యువతితో , శివ్ కు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగాక ఆ బీహార్ యువతిని తీసుకొని, శివ్ తన దేవీపూర్ గ్రామానికి బయలుదేరే సమయంలో ఆ పెళ్లికూతురు కనపడకుండా పోయింది.

ఈ చేదు అనుభవం గురికావడంతో శివ్ తన స్నేహితుడిని గట్టిగా అమ్మాయి గురించి గట్టిగా అడిగాడు. కానీ తనకేమి తెలీదంటూ కైలాష్ బుకాయించాడు. కొద్దీ సేపటికి ఆ యువతి పెళ్ళిలో పెట్టిన నగలతో పారిపోయిందని గ్రహించారు. ఇలా షాక్ ల మీద షాక్ లు తగలడంతో శివ్ కు ఏంచేయాలో పాలుపోలేదు. చివరికి శివ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు కైలాష్ గురించి ఆరా తీసాడు. అతనికి వారు ఎలా తెలుసు, అసలు ఈ సంబంధం ఎందుకు చూసాడు. ఆ వధువుకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా అని తెలుసుకొనే ప్రయత్నం లో అసలు విషయాలు తెలిసి శివ్ మరోసారి షాక్ కి గురయ్యాడు.

అదేంటంటే… కైలాష్ తనని మోసం చేయడానికి ఇలా చేసాడని, తన ఆస్తి పై కన్ను పడటంతో , ఎంతోకొంత ఆ వదువుద్వారా కొట్టేసే ప్రయత్నం చేసాడని, ఇంకా చెప్పాలంటే ఆ వధువు అసలు మహిళే కాదని, తానొక హిజ్రా అని తెలుసుకొని కోపంతో రగిలిపోయాడు. శివ్  తన బంగారాన్ని, డబ్బులు ఇవ్వకుంటే బాగుండదని కైలాష్ కి హెచ్చరించాడు.  ఇదేమి పట్టించుకోనట్టు కైలాష్ ఉండటంతో , ఇలా  ఒక హిజ్రా ని అడ్డంపెట్టుకొని జీవితాన్ని పాడుచేసినందుకు కైలాష్ ని  చంపేశాడు.

 ఈ విదంగా  దొంగతనం కేసుతో వధువు, కైలాష్ ని చంపినందుకు శివ్ , ఇక శివ్ ను మోసం చేసిన పాపానికి కైలాష్ మరణించడం. ఇలా 3 కుటుంబాల జీవితాలు పాడైపోయాయి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button