Viral news in telugu

ప్రియుడి ఎఫైర్ ను కనిపెట్టిన ఫిట్ నెస్ ట్రాకర్…రాత్రి సమయంలో ఎక్కువ కేలరీలు కరగడంతో ఆ పనే చేసాడని ..!

Cheating boyfriend

Cheating boyfriend: ఈ రోజుల్లో బడా బాబునుండి, బికారివరకు ‌ టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. తన జేబులో స్మార్ట్ ఫోన్ లేకపోతె ఏదో వెలితి ఫీల్ అవుతూ ఉంటారు. పక్కన, నా అనేవారు లేకపోయినా  భరించుతారేమో కానీ , స్మార్ట్ ఫోన్ లేకపోతె భరించలేరు. అంతలా దగ్గరైపోయింది టెక్నాలజీ. అలాగే స్మార్ట్ వాచ్ లు , ఫిట్నెస్ ట్రాకర్లు ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తాయి. ఇంకా అనారోగ్య బారిన పడబోతున్నావన్న సమాచారాన్ని ముందుగానే పసిగట్టి తెలియజేసే  ట్రాకర్లు ఇపుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

 ముందుగా వచ్చే ఆరోగ్య సమస్యలను పసిగట్టే  సెన్సర్లే , వ్యక్తులు చేసే దొంగచాటు పనులను కూడా గుర్తిస్తాయి. . తాజాగా తన ప్రియుడు చేసిన మోసాన్ని ఫిట్‌నెస్ ట్రాకర్ సాయంతో గుర్తించింది ఒక ఇంగ్లీష్ యాక్టర్. ఈ విషయాన్నీ ఈమె  టిక్‌టాక్‌ వీడియోలో ద్వారా షేర్ చేసింది. ఇది ఇపుడు  షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హెల్త్ ట్రాకర్‌, వర్కవుట్ రోటీన్‌ను టెస్ట్  చేసుకునేందుకు  ఉపయోగపడే స్మార్ట్ వాచ్ ల లో అనేక  ఫీచర్లు  అందుబాటులో ఉంటున్నాయి. అదేవిదంగా ఇద్దరి ఫిట్ నెస్ ట్రాకర్లను ఒకటే డివైజ్ కి సింక్ చేసే అవకాశంకూడా ఇందులో ఉంటుంది. దీనివల్ల డేటా మొత్తం ఒకే దగ్గర పొందవచ్చు.  ఇది చాలామందికి సౌకర్యంగా కూడా ఉంటుంది. తాజాగా దీని సాయంతోనే ‘నదియా ఎస్సెక్స్’ నటి ,  ప్రియుడి చేసిన ఆ పనిని పసిగట్టింది.  అందువల్లే  బ్రేకప్ కూడా జరిగిపోయింది.

ఆ నటి బ్రేకప్ గురించి ఒక అభిమాని షోషల్ మీడియాలో అడగడంతో , నదియా ఇలా చెప్పుకొచ్చింది…  ఒకరోజు నా మాజీ ప్రియుడు ఫ్రెండ్స్ తో కలిసి  నైట్ అవుట్‌కు బయటికి  వెళ్లాడు. ఉదయాన్నే తిరిగి ఇంటికి చేరుకున్నాడు.  ఆ రోజు పొద్దున్నే టిఫిన్ రెడీ  చేసేటప్పుడు ఫిట్ బిట్ బ్యాండ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. గత అర్ధ రాత్రి 2 నుండి 3 గంటల మధ్య తన ప్రియుడు దాదాపుగా  500 క్యాలరీల శక్తి కరిగిపోయింది ఆ నోటిఫికేషన్ లో ఉంది . ఆ సమయంలో అతడు నాతో లేడు కాబట్టి మరొకరితో  .. ఆ పనే చేసిఉంటాడు.. అందుకనే  అతడితో రిలేషన్‌షిప్ కూడా తెగిపోయిందని తెలిపింది.

నదియా పూర్తిగా వివరించలేక పోయిన, ఇంటికివచ్చే ముందు రాత్రి అతడు మరో అమ్మాయితో  గడిపినట్లు.. రాత్రి ఆ సమయంలో క్యాలరీలు కరిగిపోవడాన్ని తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకుందని అభిమానులు షోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.  ప్రియుడు చేసిన మోసాన్ని ఆమె తెలివిగా గ్రహించిందని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

టిక్‌టాక్‌లో ఈ వీడియోను కోట్ల మంది చూసారు,  వేలల్లో కామెంట్లు కూడా వచ్చాయి. ‘నదియా ఎస్సెక్స్’ ఒక  బ్రిటన్ టీవీ నటి. ఇంతకముందు ఈమే ‘సెలబ్స్ గో డేటింగ్ ‘అనే టీవీ సిరీస్‌లో తన నటనతో ఎంతోమంది అభిమానులను  సంపాదించుకుంది. ఈ నటి కి  డేటింగ్ ఎక్స్‌పర్ట్‌గా  మంచి పేరుంది. తనకి జరిగిన  ఈ ఘటనతో  ఫిట్‌నెస్‌ ట్రాకర్లు మనకు కావలసిన వారిపై కూడా నిఘా పెట్టేందుకు  ఉపయోగపడతాయని నదియా ద్వారా అందరికి తెలిసి వచ్చింది. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button