హీరో రజనీకాంత్ ఇంటిముందర బైఠాయించిన అభిమానులు…ఇప్పట్లో వదిలేలా లేరు !

rajinikanth తమిళనాడులో హీరో రజనీకాంత్ ఇంటిముందర అభిమానుల తాకిడి మొదలైంది. అక్కడ పాలిటిక్స్ ఎంత గందరగోళంగా ఉన్నాయో అందరికి తెలిసినవిషయమే, ఇలాంటి సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లో బలోపేతం కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో రజని పార్టీ పెట్టి అసెబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతానని ప్రకటించినవిషయం తెలిసిందే, కానీ ప్రస్తుతం రజని మాత్రం ఎలాంటి ప్రకటనలు రాజకీయాలపై చేస్తలేడు. అపుడు అభిమానుల ఒత్తిడిమేరకే పార్టీని స్థాపిస్తా అని చెప్పి ఉంటాడని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్దినెలల సమయం మాత్రమే ఉండడంతో, రజని ఇంతవరకు పార్టీని స్థాపించడం కానీ, పార్టీని స్థాపించి బలోపేతం చేసే విషయంలో కానీ రజని ముందుకు వెళ్లలేక పోవడంతో తన అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. రజని రాజకీయా విషయంలో ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అందులో కొంతమంది అభిమానులు మీ ఆరోగ్యం,క్షేమం మాకు ముఖ్యం మీరు ఏ నిర్ణయం తీసుకున్న స్వీకరిస్తాం అని చెప్తున్నారు.
ఇక రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో వేచిచూడాల్సిందే.