News
తెలంగాణలో కరోనా ప్రస్తుతం కంట్రోల్లోనే వుంది అన్న ఈటెల…!

భారతదేశమంతా ఆంక్షలు ఎత్తివేశాక మల్లి ఇపుడు కరోనా కొన్ని రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. ఈ విషయంలో దేశ ప్రజలు తీవ్ర ఆందోళన కు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ ,మహారాష్ట్ర, కర్ణాటక లో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ విషయాన్నీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనాను ఎదుర్కోడానికి గాంధీ, టిమ్స్, నిమ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
అలాగే ప్రస్తుతానికి తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గిందని , ఐన కానీ కరోనా కట్టడికి మరిన్ని టెస్ట్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. దేశంలో కరోనా ఉన్నంత కాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ చెప్పారు. వివిధ రాష్ట్రాలనుండి వచ్చే ప్రజలను టెస్టులు చేసిన తరువాతే తెలంగాణలోకి అనుమతిస్తున్నామని తెలిపారు.