బ్లూ టూత్ తో ఇక బండి స్టార్ట్ చేయొచ్చు…. కొత్త ఆవిష్కరణకి తెరలేపిన యువకుడు !

కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని తన ఆలోచనకు పదునుపెట్టాడు ఓ కుర్రాడు . ఇందుకోసం ముందుగా సీ, సీ ప్లస్, జావా వంటి కోర్సులు నేర్చుకొని వాటిపై పట్టు సాధించాడు. ప్రతిరోజు 15 గంటలు కష్టపడుతూ బ్లుటూత్ పరిజ్ఞానం తో ఒక బైక్ ని కిక్కు కొట్టకుండానే స్టార్ట్ చేయడాన్ని కనిపెట్టాడు.
వాహనం ఉన్న కచ్చితమైన ప్రాంతం తెలుసుకోవటానికి ఓ సిమ్‌కార్డ్‌ను కూడా ఏర్పాటు చేశాడు.
ఈ సాంకేతికతను అభివృద్ధి చేయటంలో పదిహేడు సార్లు విఫలమైనప్పటికీ ఎంతో ఓపికగా . మళ్లీమళ్లీ ప్రయత్నించాడు. విఫలమైన ప్రతీసారి సూచనల కోసం పలువురిని సంప్రదించాడు. చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాడు అల్తాఫ్.
ఈ బండిని స్టార్ట్ చేయాలంటే హెల్మెట్ కచ్చితంగా ధరించాల్సి ఉంటాడని అల్తాఫ్ తెలిపాడు. ఈ సాంకేతికత వల్ల ఇతరులెవరూ వాహనాన్నీ చోరీ చేసే అవకాశం చాలాతక్కువగా ఉంటుందట . దీనిని అభివృద్ధి చేయటంలో మా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని అల్తాఫ్ వివరించాడు.