తాళి కట్టే టైం కి షాకిచ్చిన పెళ్లికూతురు….కానీ చివరికి బకరా అయింది పెళ్లికూతురే !

మనం చిన్నప్పటినుండి చూస్తున్న సినిమాలో పెళ్లి జరిగే టైం కి, రౌడీలో, పోలీసులో వచ్చి పెళ్లిని ఆపుతూ ఉంటారు. కానీ ఇక్కడమాత్రం పెళ్లికూతుతే తన పెళ్లిని ఆపేసింది.
వివరాల్లోకి వెళ్తే, తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియదర్శిని అనే అమ్మాయి ఒక అబ్బాయితో నిచ్చితార్థం చేసుకొని, పెళ్లి సమయం వరకు బాగానే పెళ్లికొడుకుతో మాట్లాడి, సరిగ్గా తాళికడుతున్న సమయానికి పెళ్లిపీటలనుండి లేచి నిలబడి, పెళ్లి కొడుకుతో నేను ఇదివరకే ఒక అబ్బాయిని ప్రేమించాను తననే పెళ్లిచేసుకుంటాను అని చెప్పింది.
మరి ఈ విషయం ముందే చెప్పచ్చుకదా అని నిలదీయగా, నేను మా తల్లిదండ్రుల సమక్షంలో మా చుట్టాల సమక్షంలో నేను ప్రేమించినవాణ్ణి పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాను, అందుకనే పెళ్లి ఏర్పాట్లు పూర్తీ అయ్యేవరకు నీకు చెప్పలేదు.
ఇపుడు నేను ప్రేమించినవాడు ఇక్కడికి వచ్చి నాకు తాళికడతాడు అని చెప్పడంతో, పీటలమీద ఉన్న పెళ్ళికొడుకు అక్కడినుండి లేచి వెళ్ళిపోయాడు.
ఇలా జరగడంతో పెళ్ళికి వచ్చిన పెద్దలుకూడా లేచివెళ్లిపోయారు. కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ప్రేమించిన యువకుడు కూడా అక్కడికి రాకపోవడంతో పెళ్లికూతురు కాస్త బకరా అయింది .