health tips in telugu
Chadhannam – చద్దన్నంతో ఎంత వరకు మేలంటే ?
ఇప్పుడు ఉన్న జనరేషన్ వారికి చద్దన్నం యొక్క విలువ అస్సలు తెలియదు. చద్దన్నం తినడం అంటే ఏదో అనకొండ పాము నీ చూసినంత దూరం పరిగెడుతున్నారు. కానీ చద్దన్నం తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని ఇప్పుడు మేము చెప్పబోయే అంశాలను చూసి మీరే మీ ఆలోచనలను మార్చుకుంటారు.
- చద్దన్నం తినడం వల్ల ముందుగా మన జీర్ణ శక్తి మెరుగుపరుస్తుంది. మన శరీరం లోని జీర్ణ శక్తి మెరుగు చెండం వలన మనం రోజంతా ఎటువంటి చింత లేకుండా హాయి గా గడిపేస్తాం.
- మన శరీరం లో ఎముకలు దృఢంగా ఉండటానికి కావాల్సిన కార్బొహైడ్రేట్స్, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్, కాల్షియం అన్ని మనకు చద్దన్నం లో పుష్కలంగా లభిస్తాయి.
- అల్సరు, హై బీపీ , వేడి ఎక్కువ ఉన్నవారికి ఈ చద్దన్నం ఒక్క ఔషదం లా పనిచేస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న చద్దన్నం తయారు చేయడం చాలా సులభం. రాత్రి అన్నం వండుకునేటప్పుడు కాస్త ఎక్కువ అన్నం వండుకుంటే చాలు. మిగిలిన అన్నాని ఒక్క కుండ లో పెట్టీ అందులో పాలు పోసి తోడుకి పెట్టేయాలి. రాత్రికి అది పులుస్తుంది మరియు ఉదయం లోగా చద్దన్నం గా మారిపోతుంది.
ఈ చద్దన్నం లో మనం పచ్చి మిర్చీలు మరియు ఉల్లిపాయలు నంచుకొని తింటే రుచికి రుచి బలని బలం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చద్దన్నం తినడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి.