Tollywood news in telugu
నమ్మించాడు… చివరికి కడతేర్చాడు !

ఒక షాపింగ్ మాల్ లో పనిచేసే యువతిని మూడు సంవత్సరాలుగా ప్రేమించిన యువకుడు, ఆ యువతిని మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. అదేంటని ప్రశినిచ్చిన యువతిని కడతేర్చడానికికూడా వెనకాడలేదు.
వివరాల్లోకి వెళ్తే, ఆత్మకూరు కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు, హైదరాబాద్ లోని ఒక షాపింగ్ మల్ లో పనిచేసే శ్వేతా అనే యువతిని ప్రేమించాడు. కానీ శ్రీనివాస్ ఎందుకనో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం తెలుకున్న శ్వేతా శ్రీనివాస్ ని నిలదీయడం మొదలుపెట్టింది. శ్వేతా టార్జార్ ని భరించలేని శ్రీనివాస్ ప్లాన్ ప్రకారం, శ్వేతతో పర్సనల్ గా మాట్లాడని చెప్పి శ్రీను తన బండిపై అమరచింత ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రలోల్ పోసి తగలపెట్టి చంపాడు.
శ్వేతా కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీను ను అరెస్ట్ చేసి కూపీ లాగడంతో, హత్య చేసింది తానే అని శ్రీనివాస్ ఒప్పుకున్నాడు.