వామ్మో..! అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఎలుగుబంట్లు హల్ చల్…
వామ్మో..! అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఎలుగుబంట్లు హల్ చల్: మనం ఎలుగుబంట్లు గ్రామాలలో, పట్టణాల్లో సంచరించడం చూసుకుంటాం… కానీ ఎప్పుడైనా ఎలుగుబంట్లు పోలీస్ స్టేషన్లో కల తిరగడం చూసుంటారా..!

మనం ఎలుగుబంట్లు గ్రామాలలో, పట్టణాల్లో సంచరించడం చూసుకుంటాం… కానీ ఎప్పుడైనా ఎలుగుబంట్లు పోలీస్ స్టేషన్లో కల తిరగడం చూసుంటారా..! అలాంటి ఘటన ఒక్కటి చత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఎలుగుబంటి పిల్లలు పోలీస్ స్టేషన్ ను, అందులో వున్న సామాగ్రిని పరిశీలించాయట…
పూర్తి వివరాల్లోకి వెళితే చత్తీస్గఢ్లోని కన్కేర్ పోలీస్ స్టేషన్లోకి అర్ధరాత్రి మూడు ఎలుగుబంటి పిల్లలు వచ్చాయి. మొత్తం పోలీస్ స్టేషన్ అంత తిరిగాయి. డ్యూటీ లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆందోళన చెందారు. కానీ ఎలుగుబంట్లు వచ్చిన దారినే మళ్లీ తిరిగి వెళ్ళిపోయాయట…
దీనిపై తాజాగా ఐపీఎస్ అధికారి దీపాన్షు ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేశారు. “అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో 3 ఎలుగుబంట్లు తనిఖీ చేసాయి. ఇదంతా చూస్తున్న పోలీస్ సిబ్బంది ధైర్యానికి,ఓపికకి నా సెల్యూట్. అదేవిధంగా మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అంటూ ట్వీట్ చేశారు.
దీంతో ఈ వీడియో వైరల్ గా మారడంతో.. పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎలుగుబంట్లు కూడా తమ సమస్యలపై కంప్లాంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్లోకి వచ్చాయని కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.