News
ఒక ఆలయ పూజారి అఘాయిత్యం … !

ఒక ఆలయపూజారి చేసిన పనికి యావత్ బ్రాహ్మణ జాతికే అవమానం జరిగే సంఘటన బెంగుళూర్ లో చోటుచేసుకుంది.
చిక్ బల్లాపూర్ కి చెందిన వెంకటరమణప్ప (69) అనే వ్యక్తి ఒకప్పుడు ఆలయ పూజారిగా పనిచేసాడు.
ప్రస్తుతం వెంకటరమణప్ప అల్లుడు పనిమీద ఊరెళ్ళడంతో, ఇతను తన అల్లుడు చూసుకొనే గుడి ని చూసుకుంటున్నాడు.
ఒక రోజు ఆ గుడిముందు 10 సంవత్సరాల బాలిక ను వెంకటరమప్ప చూసి ఆ బాలికను ఇంటికి వస్తే స్వీట్ లు ఇస్తానని ఆశ చూపి హత్యాచారం చేసాడు.
ఆ గుడి ముందు పూలు అమ్ముకుంటున్న వ్యక్తి ద్వారా ఈ విషయంతెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పూజారి ఇంటికి వెళ్లగా ఆ బాలిక ఏడుస్తూ ఉండడంతో వారు ఆరా తీయగా బాలిక నిజం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను పరీక్షల నిమిత్తం హాస్పిటల్ లో చేర్పించారు.