సోనూసూద్ కి ‘ఆచార్య’ టీమ్ ఘన సన్మానం !

Sonu Sood : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యనే తిరిగి ప్రారంభం అయ్యింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నే ఒక సెట్‌లో చేస్తున్నారు
ఈ సినిమా లో సోనూసూద్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న సంగతి మీకు తెలిసిందే. షూటింగ్ లో తన డేట్స్ రావడంతో సోను హైదరాబాద్ లోని ఆచార్య సెట్ కి చేరుకోవడంతో, దర్శకుడు కొరటాల శివ, నటుడు తనికెళ్ల భరణి సోనూకు ఘన స్వాగతం పలికారు.
లాక్‌డౌన్ వేళ లక్షలాదిమంది వలసకార్మికులు, విద్యార్థులను సోనూసూద్ ఆదుకున్నారు. ఈ క్రమంలో అతడి సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక అవార్డును కూడా ప్రదానం చేసింది .
ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ మరో సారి జతకడుతున్నారు. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో తెరపై కనిపించనున్నారు.