Political News
అందుకే ఆ ఊరు అంటే అభిమానం !

ప్రస్తుతం నెల్లూరు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఊరు మా అమ్మవాళ్ల ఊరు, నేను ఈ ఊరిలో పుట్టి ఇక్కడే కొన్నాళ్లు పెరిగాను, అందుకనే ఈ ఊరు అంటే నాకు చాల ఇష్టం, అలాగే ఇక్కడి రాజకీయాలు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేవని తెలిపాడు.
అదేవిదంగా తాను టెన్త్ గ్రేస్ మార్కులతో పాసయ్యాను, తాను స్టడీ మధ్యలో ఆపేసాను .. కానీ చదవడం ఇప్పటికి ఆపలేదు అని తెలిపాడు. నా చిన్నపుడు పెద్దగా ఆశయాలు ఏంలేవని, ఒక పోలీస్ అయి ప్రజలకు రక్షణగా ఉండాలని మాత్రం అనుకునేవాడిని అని తెలిపాడు.
అలాగే మా చుట్టాల కుటుంబాలలో చిన్న చిన్న రాజకీయ వాతావరణం ఉండడం వాళ్ళ నాకు రాజకీయాలపై వున్న ఆశక్తి వల్ల ఇలా మీ ముందు ఉన్నానని తెలిపాడు.