Thalapathi Vijay Filed case on his parents : సొంత తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన విజయ్ :-

Thalapathi Vijay Filed case on his parents : విజయ్ ఈ పేరు తమిళ నాట యమా క్రేజు. విజయ్ సినిమా విడుదల అంటే ఫాన్స్ రెండ్రోజుల ముందునుంచే హంగామా చేయడం షురూ చేస్తారు. వరుస సినిమాలతో లైఫ్ బిజీ గా గడుపుతున్న విజయ్ , ప్రస్తుతం బీస్ట్ సినిమాకి షెడ్యూల్ వేసుకున్నారు.
ఇదిలా ఉండగా సొంత తల్లిదండ్రుల మీదనే కేసు ఫైల్ చేసారు విజయ్. మ్యాటర్లోకి వెళ్తే ఇటీవలే విజయ్ తండ్రి అయినా యస్.ఏ. చంద్రశేఖర్ పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు అల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం. ఈ పార్టీ కి నాయకుడిగా పద్మనాభన్ ఉండగా, ట్రెజరీ గా శోభా చంద్రశేఖర్ మరియు జనరల్ సెక్రటరీ గా చంద్రశేఖర్ గారు ఉన్నారు. పార్టీ పేరు వినగానే విజయ్ అభిమానులు అందరు మరియు తమిళనాట ప్రజలు ఇది విజయ్ పార్టీ అని , విజయ్ కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని భావించి పార్టీ లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న విజయ్ అధికారికంగా ప్రజలముందర నాకు పాలిటిక్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకు , అల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ కి అస్సలు సంబంధమే లేదు. దయచేసి ఎవరు ఆ పార్టీ లో జాయిన్ అవ్వకండి అని సభాముఖంగా చెప్పారు.
ఇదిలా ఉండగా గతం లో విజయ్ ఒక ప్రెస్ నోట్ కూడా వదిలారు అందులో నాకు పొలిటిషన్స్ తో ఎలాంటి సంబంధం లేదు. నాన్న పెట్టిన పార్టీ కి నాకు లింక్ చేయకండి. నా ఫ్యాన్స్ ఎవ్వరు ఆ పార్టీ లో జాయిన్ అవ్వకండి. పొరపాటున కూడా ఎవరైనా ఆ పార్టీ ప్రచారం కోసం నా ఫోటోలు కానీ, నా పేరు చెప్పి దుర్వినియోగం చేయడం జరిగితే చట్టరీత్య సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని అందరికి ఒకేసారి సమాధాం ఇచ్చారు విజయ్.
ఇపుడు విజయ్ పేరుతో ప్రచారాలు పోస్టర్ల రూపం లో వాడటంతో విజయ్ అతని తల్లిదండ్రులతో పాటు 11 మంది కార్యకర్తలు మీద కూడా కంప్లైంట్ చేసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందో అని.