movie reviews

Thalaivii Movie Review In Telugu | తలైవి

 Thalaivii  As Kangana
Thalaivii As Kangana

Movie Review : Thalaivii (In And As Kangana Ranaut)

Director: AL Vijay

Release date: 10th September 2021

Written by: KV Vijayendra Prasad, Madhan Karky, Rajat Arora

Production: Zee Studios, Vibri Motion Pictures, Karma Media And Entertainment, Gothic Entertainment, Sprint Films

Produced by: Vishnu Vardhan Induri, Shailesh R Singh, Brinda Prasad.

ఈవారం ప్రేక్షకులని అలరించడానికి కంగనా(Kangana) మరియు అరవింద్ స్వామి కలిసి తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి అయినా జయలలిత గారి బయోపిక్ తో వస్తున్నారు. ప్రొమోషన్స్ మరియు ట్రైలర్ తో సినిమా మీద ఉన్న హైప్ పెంచారు. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ:-

ఈ కథ తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి అయినా జయ లలిత(Jayalalitha Biopic) జీవిత చరిత్ర. జయలలిత అసెంబ్లీ లో చేసే ప్రసంగం తో మొదలయ్యే ఈ సినిమా వెంటనే తన ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి 16 ఏళ్ళ వయసులోనే సినిమాలో అవకాశాలు రావడం. ఇష్టం లేకపోయినా బలవంతంగా సినిమాలు చేయడం తో సాగుతుంది.. ఆలా సినిమాలు చేస్తున్న సమయం లో పెద్ద స్టార్ అవ్వగా అదే సమయం లో తనకు సినిమా అవకాశాలు వచ్చేలా చేసిన ఎంజీ రామ‌చంద్ర‌న్ ఎంజీఆర్‌ (అర‌వింద్ స్వామి) తో జయ లలిత గారి అనుభందం ఎలా ఉండేది? వరుసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న జయలలిత సడన్ గా రాజకీయల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది ? ఎవరి వళ్ళ వచ్చింది ? తాను గురువుగా భావించే ఎంజీఆర్‌ మరణించాక ఆమె ఎదురుకున్న సంఘటనలు ఎటువంటివి ? ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని జయలలిత ముఖ్య మంత్రి అయ్యారు ? ఇలా.ఎం జయలలిత గారి బాల్యం నుంచి ముఖ్య మంత్రి పదవి స్వీకరించే దక్క ఈ సినిమా నడుస్తుంది. ఇలా జయలలిత గారి జీవితము లో ఎదురుకున్న సవ్వాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

👍 :-

  • కంగనా చాలా బాగా చేసింది. అరవింద్ స్వామి కూడా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.
  • కథ మరియు కథనం
  • సెకండ్ హాఫ్ మరియు అసెంబ్లీ సన్నివేశాలు.
  • మ్యూజిక్ చాలా బాగుంది.
  • దర్శకత్వం.
  • ఎడిటింగ్ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

👎 :-

  • ఫస్ట్ హాఫ్ లో కొని సన్నివేశాలు.
  • జయలలిత గారి బయోపిక్ పూర్తిగా తియలేకపోవడం.

ముగింపు :-

Rating:- 3 /5

మొత్తానికి Thalaivii అనే సినిమా జయలలిత గారి బయోపిక్ (Jayalalitha Biopic) నీ ఎకడ తగ్గకుండా ఉన్నది ఉన్నట్లు చూపించారు. కంగనా (kangana) జయలలిత గా పాత్రలో ఒదిగిపోయింది. అరవింద్ స్వామి కూడా చాలా బాగా చేశారు. మిగితా నటీనటులు కూడా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ సన్నివేశాలు ఉన్నపటికీ , సెకండ్ హాఫ్ మరియు అసెంబ్లీ సన్నివేశాలు చాలా బలంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది. దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశారు. జయలలిత గారి బయోపిక్ పూర్తిగా చేపింటే ఇంకా బాగుండేది. మొత్తానికి ఈ సినిమా ఈ వారం కుటుంబం అంత చూసి జయలలిత గారి గురించి తెలుసుకోవచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button